iDreamPost
android-app
ios-app

క్రేజీ ఫీచర్లతో యమహా నుంచి మరో స్కూటర్.. ధర కూడా తక్కువే

వాహనదారులకు మరో కొత్త స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. యమహా కంపెనీ ఫ్యాసినో ఎస్ మోడల్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. స్టన్నింగ్ డిజైన్, న్యూలుక్ తో ఉన్న ఈ స్కూటర్ వాహనదారులను ఆకట్టుకుంటోంది.

వాహనదారులకు మరో కొత్త స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. యమహా కంపెనీ ఫ్యాసినో ఎస్ మోడల్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. స్టన్నింగ్ డిజైన్, న్యూలుక్ తో ఉన్న ఈ స్కూటర్ వాహనదారులను ఆకట్టుకుంటోంది.

క్రేజీ ఫీచర్లతో యమహా నుంచి మరో స్కూటర్.. ధర కూడా తక్కువే

వాహన ప్రియుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త స్కూటర్లు మార్కెట్ లోకి విడుదలవుతూనే ఉన్నాయి. ఓ వైపు ఎలక్ట్రిక్ వెహికిల్స్, మరోవైపు పెట్రోల్ తో నడిచే వాహనాలు పోటాపోటీగా రిలీజ్ అవుతున్నాయి. ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలు అప్ డేటెడ్ వర్షన్ తో అదిరిపోయే ఫీచర్లతో టూవీలర్స్ ను రూపొందించి రిలీజ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో మరో కొత్త స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. యమహా కంపెనీ ఫ్యాసినో ఎస్ మోడల్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. స్టన్నింగ్ డిజైన్, న్యూలుక్ తో ఉన్న ఈ స్కూటర్ వాహనదారులను ఆకట్టుకుంటోంది. ఈ స్కూటర్ ధర కూడా తక్కువగానే ఉంది.

యమహాకు చెందిన ఫ్యాసినో ఎస్ మోడల్ స్కూటర్ రెండు వేరియంట్లలో లభించనున్నది. ఈ స్కూటర్ ధర రూ. 93,730, రూ.94,530గా కంపెనీ నిర్ణయించింది. బీఎస్‌-6 ప్రమాణాలకు లోబడి ఈ స్కూటర్‌ను తయారు చేసినట్లు, ముఖ్యంగా 125 సీసీ ఇంజిన్‌తో తయారైన ఈ మాడల్‌ స్మార్ట్‌ మోటర్‌ జనరేటర్‌(ఎస్‌ఎంజీ), సైలెంట్‌ స్టార్ట్‌, ఎయిర్‌-కూల్డ్‌, పనితీరు భాగుటుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ స్కూటర్ ‘ఆన్సర్ బ్యాక్’ అనే ఫీచర్‌తో వస్తుంది. దీని సాయంతో యమహా మొబైల్ యాప్ ద్వారా కూడా వినియోగదారులు తమ ఫాసినో ఎస్ మోడల్ ట్రాక్ చేయొచ్చు.

ఒకసారి ఈ యాప్ యాక్టివేట్ అయిన తర్వాత స్కూటర్ లెఫ్ట్, రైట్ ఇండికేషన్స్ హారన్ సౌండ్‌తో పాటు సుమారు రెండు సెకన్ల పాటు ఆన్ బ్లింక్ అవుతాయి. ఈ కొత్త వేరియంట్ బరువు 99కిలోలు, అండర్ సీట్ స్టోరేజ్ 21 లీటర్లు ఉంటుంది. ఈ స్కూటర్ సుజుకీ, హోండా, ఆక్టీవా స్కూటర్లకు గట్టి పోటీ ఇవ్వనున్నట్లు మార్కెట్ నిపుణులు వెల్లడిస్తున్నారు. కొత్త స్కూటర్ కొనాలనుకునే వారు యమహా ఫ్యాసినో ఎస్ మోడల్ ను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.