iDreamPost
android-app
ios-app

HYD శివారులో మరో కొత్త సిటీ.. 12 లక్షలకే 100 గజాల స్థలం.. ఇప్పుడే కొంటే రెట్టింపు లాభాలు

  • Published Jul 10, 2024 | 4:23 PM Updated Updated Jul 10, 2024 | 4:23 PM

Hyderabad Yacharam, Kandukur Land Prices: భూమ్మీద పెట్టుబడి పెట్టాలి, ఫ్యూచర్ లో భారీ లాభాలను పొందాలి అనుకునేవారికి ఇదే సరైన అవకాశం. హైదరాబాద్ నగర శివారులో కొత్త సిటీ ఏర్పడుతుంది. దీంతో ఆ ఏరియాలో భూముల ధరలకు రెక్కలు వస్తాయి. ఇప్పుడు తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఫ్యూచర్ లో భారీ లాభాలను పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు.

Hyderabad Yacharam, Kandukur Land Prices: భూమ్మీద పెట్టుబడి పెట్టాలి, ఫ్యూచర్ లో భారీ లాభాలను పొందాలి అనుకునేవారికి ఇదే సరైన అవకాశం. హైదరాబాద్ నగర శివారులో కొత్త సిటీ ఏర్పడుతుంది. దీంతో ఆ ఏరియాలో భూముల ధరలకు రెక్కలు వస్తాయి. ఇప్పుడు తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఫ్యూచర్ లో భారీ లాభాలను పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు.

HYD శివారులో మరో కొత్త సిటీ.. 12 లక్షలకే 100 గజాల స్థలం.. ఇప్పుడే కొంటే రెట్టింపు లాభాలు

హైదరాబాద్ నగరం నగర శివారుల వరకూ విస్తరిస్తోంది. తెలంగాణలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ క్రమంలో నగర శివారు ప్రాంతాల్లో రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాపర్టీలకు విలువ పెరిగింది. హైదరాబాద్ మాత్రమే కాకుండా.. హైదరాబాద్ లాంటి సిటీని.. హైదరాబాద్ లో ఉన్న ప్రముఖ ఏరియాలను తలదన్నేలా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరో మాదాపూర్, మరో గచ్చిబౌలి, మరో బంజారాహిల్స్, మరో కూకట్ పల్లిలా కొన్ని నగర శివారు ప్రాంతాలు కూడా డెవలప్ కాబోతున్నాయని ఇప్పటికే రియల్ ఎస్టేట్ నిపుణులు హింట్ ఇచ్చారు. కాగా హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో మరో కొత్త సిటీ ఏర్పడనుంది.   

తెలంగాణ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలో గ్రీన్ సిటీ ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ గ్రీన్ సిటీ ఏర్పాటుతో ఆ జిల్లాలోని ఆయా మండలాల్లో భూముల ధరలు పెరగనున్నాయి. యాచారం, కందుకూరు సమీపంలో ఉన్న 6 వేల ఎకరాల్లో గ్రీన్ సిటీని ఏర్పాటుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. గ్రీన్ సిటీ పూర్తయితే కనుక హైదరాబాద్ నగర శివారులో మరో కొత్త సిటీ వచ్చినట్టే అవుతుంది. గ్రీన్ సిటీ పేరులోనే గ్రీన్ ఉండడం.. నగరంలో కాలుష్యం పెరిగిపోతుండడంతో ఈ గ్రీన్ సిటీలో నివాసం ఉండేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. 

ప్రస్తుతం యాచారం మండలంలో చదరపు అడుగు స్థలం రూ. 1200గా ఉంది. ఒక 1000 చదరపు అడుగుల స్థలం కొనాలంటే 12 లక్షలు అవుతుంది. గజం స్థలం ధర రూ. 10,800 అవుతుంది. అంటే 100 గజాల స్థలం కొనాలంటే రూ. 12 లక్షలు, అదే 150 గజాల స్థలం కొనాలంటే రూ. 16 లక్షలు అవుతుంది. కందుకూరు మండలంలో అయితే చదరపు అడుగు స్థలం రూ. 900 నుంచి రూ. 1900గా ఉంది. ఇక్కడ గజం స్థలం రూ. 8 వేల నుంచి 18 వేల వరకూ ఉన్నాయి. 150 గజాల స్థలం కొనాలంటే యావరేజ్ గా రూ. 12 లక్షల నుంచి రూ. 27 లక్షల వరకూ అవుతుంది. ఇప్పుడు కనుక కొనుక్కుంటే ఫ్యూచర్ లో రెట్టింపు లాభాలను పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ సిటీ పూర్తయితే ఈ ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు వస్తాయని చెబుతున్నారు

గమనిక: పలువురు రియల్ ఎస్టేట్ నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వబడింది. మీరు పెట్టుబడి పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి అవగాహనతో పెట్టుబడి పెట్టాల్సిందిగా మనవి.