iDreamPost
android-app
ios-app

Robotic Cafe: రోబోటిక్ కేఫ్ బిజినెస్: ఫుడ్ ఐటమ్స్ రెడీ చేసి సర్వ్ చేసే రోబో కేఫ్

  • Published Aug 09, 2024 | 4:14 PM Updated Updated Aug 09, 2024 | 4:14 PM

Robotic Cafe: ఫుడ్ బిజినెస్ కి మించిన డిమాండ్ మరే వ్యాపారానికి లేదు. ఇందులో పెట్టుబడి పెడితే సగానికి సగం మిగులుతుందని అంటారు. అయితే ఈ వ్యాపారం చేయాలంటే వంటలు వచ్చి ఉండాలి. అయితే అందరికీ వంటలు వండడం అనేది రాదు. దీంతో వంట మాస్టర్ ని పెట్టుకుంటారు. దాని కోసం నెలకి భారీగా చెల్లించుకోవాలి. ఆ వంట మాస్టర్ హ్యాండ్ ఇస్తే వచ్చిన కస్టమర్స్ వెళ్ళిపోతారు. మరి డబ్బులు ఉండి ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎలా? అంటే దీనికి పరిష్కారమే ఈ రోబోటిక్ కేఫ్ బిజినెస్. 

Robotic Cafe: ఫుడ్ బిజినెస్ కి మించిన డిమాండ్ మరే వ్యాపారానికి లేదు. ఇందులో పెట్టుబడి పెడితే సగానికి సగం మిగులుతుందని అంటారు. అయితే ఈ వ్యాపారం చేయాలంటే వంటలు వచ్చి ఉండాలి. అయితే అందరికీ వంటలు వండడం అనేది రాదు. దీంతో వంట మాస్టర్ ని పెట్టుకుంటారు. దాని కోసం నెలకి భారీగా చెల్లించుకోవాలి. ఆ వంట మాస్టర్ హ్యాండ్ ఇస్తే వచ్చిన కస్టమర్స్ వెళ్ళిపోతారు. మరి డబ్బులు ఉండి ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎలా? అంటే దీనికి పరిష్కారమే ఈ రోబోటిక్ కేఫ్ బిజినెస్. 

Robotic Cafe: రోబోటిక్ కేఫ్ బిజినెస్: ఫుడ్ ఐటమ్స్ రెడీ చేసి సర్వ్ చేసే రోబో కేఫ్

హైదరాబాద్ లాంటి నగరాల్లో కేఫ్స్ కి మంచి డిమాండ్ ఉంది. కాఫీ, ఐస్ క్రీమ్, స్నాక్స్ రిలేటెడ్ కేఫ్స్ పెడితే లక్షల్లో సంపాదించుకోవచ్చు. అలా అని దీని కోసం ఒక మనిషి ఉండాలేమో అని అనుకుంటున్నారేమో. అదేమీ అవసరం లేదు. ఈ రోబోటిక్ కేఫ్ లో ఒక రోబో ఉంటుంది. అదే అన్నీ వండేస్తుంది.. వచ్చిన కస్టమర్స్ కి వడ్డించేస్తుంది. దీని కోసం లోపల కిచెన్ ఐటమ్స్, కిచెన్ సెటప్, మళ్ళీ ఫుడ్స్, కాఫీ వంటివి చేయడానికి మాస్టర్ ఏమీ అవసరం లేదు. మొత్తం అదే చూసుకుంటుంది. ఇది ఎక్స్ బాట్ రోబోటిక్ కేఫ్. ఇది ప్రపంచంలోనే ఫుల్లీ ఆటోమేటెడ్ మల్టీ ప్రాడెక్ట్ రోబో కేఫ్. వివిధ రకాల ఫుడ్స్ ని, డ్రింక్స్ ని తయారుచేసి అందించే మెషిన్. మొత్తం ఒక సెట్ లా వచ్చేస్తుంది. ప్రత్యేకించి చెఫ్స్ ని లేదా కుకింగ్ మాస్టర్ ని పెట్టుకోనవసరం లేదు. అలానే 

కాఫీ, ఐస్ కాఫీ, హాట్ చాక్లెట్, మిల్స్ షేక్స్, ఐస్ క్రీమ్, టాపింగ్స్, టీ, స్నాక్ బాక్సెస్ ఇలా ఏది కావాలన్నా కస్టమర్ ఎంచుకున్న దాన్ని నిమిషాల్లో చేసి ఇచ్చేస్తుంది. సాధారణ మనుషుల కంటే వేగంగా పని చేస్తుంది. వీటిలో మీకు నచ్చిన ఐటంకి సంబంధించిన బిజినెస్ ని సెట్ చేసుకోవచ్చు లేదా అన్నీ కలిపి ఒకే బిజినెస్ కేఫ్ గా పెట్టుకోవచ్చు. ఇందులో మూడు రకాల రోబోటిక్ కేఫ్ మోడల్స్ ఉన్నాయి. కాఫీ రోబో, ఐస్ క్రీమ్ రోబో, రోబోటిక్ కేఫ్ ఇలా మూడు మోడల్స్ ఉన్నాయి. కాఫీ రోబో లేదా బారిస్టా కాఫీ మోడల్ లో రోబో కస్టమర్ కి నచ్చిన కాఫీని 70 నుంచి 90 సెకన్లలో చేసి అందిస్తుంది. ఐస్ క్రీమ్ రోబో కేఫ్ ఒకటి ఉంది. ఇది 40 సెకన్లలోనే ఐస్ క్రీమ్ తయారు చేసి అందిస్తుంది. మూడవది అన్నీ కలిపి ఉన్న కేఫ్. ఇందులో డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, కాఫీ సహా వివిధ రకాల డ్రింక్స్, ఫుడ్స్ ఉంటాయి.

ఈ రోబోటిక్ కేఫ్ పైన స్క్రీన్ మీద ఫుడ్, డ్రింక్స్ కి సంబంధించిన ఐటమ్స్ డిస్ప్లే అవుతాయి. కస్టమర్స్ డిస్ప్లే మీద ఉన్న మెనూ జాబితా చూసి కావాల్సిన ఐటంని ఎంపిక చేసుకుని కింద ఉన్న క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు మెషిన్ మీద స్వైప్ చేసి ఆర్డర్ చేస్తే చాలు.. నిమిషాల్లో తెచ్చి అందిస్తుంది. లగ్జరీ లుక్ తో పాటు ఫాస్ట్ గా ఐటమ్స్ రెడీ చేసి ఎక్కువ మంది కస్టమర్స్ కి సర్వ్ చేయడం వల్ల సాధారణ కేఫ్ ల మీద వచ్చే లాభాల కంటే ఎక్కువ లాభాలు పొందవచ్చు. ఇందులో సేఫ్టీ గ్లాస్, కాఫీ మెషిన్, టీ స్టేషన్, డ్రై ఫుడ్ స్టేషన్, సప్లై కోసం స్టోరేజ్ స్పేస్, రోబోటిక్ ఆర్మ్, టాపింగ్ డిస్పెన్సర్, ఐస్ క్రీమ్ మెషిన్, ఆర్డర్ టెర్మినల్ టచ్ స్క్రీన్, సర్వింగ్ విండో వంటి వాటితో కేఫ్ సెటప్ వస్తుంది. ఇది నాలుగు చదరపు మీటర్ల విస్తీర్ణంలో సరిపోతుంది. 43 చదరపు అడుగుల విస్తీర్ణంలో సరిపోతుంది.

Millions of profits with this robotic cafe! 1

దీని డిజైన్ కస్టమర్స్ ని ఆకర్షిస్తుంది. కొత్తగా ఉండడం, వేగంగా పర్ఫెక్ట్ టేస్ట్ తో సర్వ్ చేయడం వంటి కారణాల వల్ల క్యూ కడతారు. స్టాఫ్ మెంబర్స్ అంటే ఒక మనిషి ఉండవచ్చు లేకున్నా పని జరిగిపోద్ది. ఇక సేల్స్ ని కంప్యూటర్, ల్యాప్ టాప్ లేదా మొబైల్ నుంచి ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. జస్ట్ ప్లగ్ అండ్ ప్లే చేస్తే స్టార్ట్ అయిపోతుంది. స్టాఫ్ అవసరం లేదు.. తక్కువ అద్దె ఎక్కువ లాభాల తెచ్చి పెడుతుంది. దీని మీద పెట్టిన 100 శాతం పెట్టుబడి ఆరు నెలల నుంచి ఏడాది లోపు వస్తుందని కంపెనీ చెబుతుంది. ఈ ఒక్క రోబో కేఫ్.. 7 ఫుడ్ అండ్ డ్రింక్ ఐటమ్స్ ని నిరంతరాయంగా సర్వ్ చేస్తుంది. కస్టమర్ కి నచ్చిన ఫ్లేవర్ తో సర్వ్ చేస్తుంది.  

తక్కువ ఖర్చుతో అధిక లాభాలను పొందవచ్చు. మాల్స్, పార్క్స్, ఎయిర్ పోర్ట్స్ వంటి జనసమూహం ఉన్న చోట ఈ కేఫ్ పెట్టుకుంటే ఖచ్చితమైన లాభాలను పొందవచ్చు. నచ్చిన కస్టమైజ్డ్ కాఫీ, ఐస్ క్రీమ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఒకేసారి 4 కప్స్ ని హ్యాండ్లింగ్ చేయగలదు ఈ రోబో. ఈ కేఫ్ ని కొనుక్కోవచ్చు. లేదా అద్దెకు కూడా తీసుకోవచ్చు. ఈ మోస్ట్ అడ్వాన్స్డ్ రోబోటిక్ కేఫ్ ని దుబాయ్ కి చెందిన వీఎల్టీ రోబోటిక్స్ అనే కంపెనీ తయారు చేసింది. ఎవరికైనా కావాలనుకుంటే తమను సంప్రదించాలని కంపెనీ తెలిపింది. దీని ధర కూడా తక్కువే అని కంపెనీ చెబుతుంది. పలు నివేదికల ప్రకారం.. దీని ప్రారంభ ధర 20 లక్షలు ఉండవచ్చు.