nagidream
Telugu States Women Investors Are Increasing Than Men Says Axis Mutual Fund In Report: తెలుగు రాష్ట్రాల్లో మగవారి కంటే ఆడవారి దగ్గరే ఎక్కువ సంపద ఉందని సంచలన నివేదికలో వెల్లడైంది. మగవారితో పోలిస్తే ఆడవారే ఎక్కువగా డబ్బులు పొదుపు చేస్తున్నారని తేలింది.
Telugu States Women Investors Are Increasing Than Men Says Axis Mutual Fund In Report: తెలుగు రాష్ట్రాల్లో మగవారి కంటే ఆడవారి దగ్గరే ఎక్కువ సంపద ఉందని సంచలన నివేదికలో వెల్లడైంది. మగవారితో పోలిస్తే ఆడవారే ఎక్కువగా డబ్బులు పొదుపు చేస్తున్నారని తేలింది.
nagidream
కొంతమంది మగాళ్లు సంపాదించిన జీతాన్ని, డబ్బుని ఇంట్లో భార్యలకు ఇచ్చేస్తారు. కొంతమంది ఇవ్వకుండా మొత్తం వాళ్ళే పెత్తనం చెలాయిస్తుంటారు. ఆస్తులు కొంటూ ఉంటారు. వేరే వాటిలో పెట్టుబడి పెడుతూ ఉంటారు. ఎలా చూసినా గానీ సంపాదన విషయంలో మగవాళ్లదే పై చేయి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా ఉద్యోగాలు చేసేది, పనులు చేసేది మగవారే కాబట్టి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మగవారే ఎక్కువగా ఉంటారు. ఈ లెక్కన చూస్తే మగవారి దగ్గరే ఎక్కువ డబ్బు ఉండాలి. కానీ విచిత్రంగా మగవారి కంటే కూడా మగాళ్ల దగ్గరే ఎక్కువగా డబ్బు ఉందని తాజా నివేదికలో తేలింది. ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య పెరగడం కావచ్చు, వచ్చిన డబ్బులను వృధా ఖర్చు పెట్టకుండా దాచుకోవడం కావచ్చు, పథకాల డబ్బులను పొదుపు చేయడం కావచ్చు.. ఇలా రకరకాల కారణంగా మహిళల దగ్గరే అధిక నిధి ఉందని తేలింది. డబ్బు రూపంలో గానీ, బంగారం వంటి వాటి రూపంలో గానీ పురుషులతో పోలిస్తే మహిళల వద్దే అధిక సంపద ఉందని యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ నివేదిక వెల్లడించింది.
పెట్టుబడుల నిర్ణయాలను స్వేచ్ఛగా తీసుకోవడంతో పాటు దీర్ఘకాలిక పెట్టుబడులను కొనసాగించే మహిళా పెట్టుబడిదారుల సంఖ్య పెరుగుతోందని తెలిపింది. ఫిన్ టెక్ సంస్థల విస్తరణ, డిజిటల్ టెక్నాలజీ పెరగడం, పెట్టుబడి మార్గాలు సులువుగా ఉండడం వంటి కారణాల వల్ల మహిళా ఇన్వెస్టర్లు పెరిగారని యాక్సిడ్ మ్యూచువల్ ఫండ్ నివేదిక వెల్లడించింది. యాక్సిస్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడుతున్న వారిలో అత్యధికంగా 30 శాతం మంది ఉన్నారని.. అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ (ఏయూఎం)లో మహిళల వాటా 35 శాతంగా ఉందని నివేదికలో వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్ లో 4.7 రెట్లు, తెలంగాణలో 3.1 రెట్లు మేర మహిళా ఇన్వెస్టర్ల సంఖ్య పెరిగిందని నివేదిక వెల్లడించింది. వీరి పెట్టుబడి మొత్తం ఏపీలో 4.1 రెట్లు, తెలంగాణలో 3 రెట్లు పెరిగిందని స్పష్టం చేసింది. మగాళ్ళతో పోలిస్తే మహిళలే 25 శాతం అధికంగా పెట్టుబడి పెడుతున్నారని.. సగటున 37 శాతం మహిళల దగ్గరే ఎక్కువ సంపద ఉందని తేలింది.
ఐదేళ్ల వ్యవధికి మించి పెట్టుబడులు పెడుతున్న మహిళలు 22 శాతం వరకూ ఉంటున్నారని.. గత ఐదేళ్ల కాలంలో ఫిన్ టెక్ యాప్ లను వాడుతున్న యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ మహిళా ఇన్వెస్టర్ల సంఖ్య 14 నుంచి 55 శాతానికి పెరిగినట్లు నివేదికలో తేలింది. 71.9 శాతం మంది మహిళలు సొంతంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటున్నారని.. ముఖ్యంగా యువతులలో ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తుందని యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ తన నివేదికలో వెల్లడైంది. 25 నుంచి 34 ఏళ్ల వయసున్న మహిళలు 75 శాతం ఉండగా.. 35 నుంచి 44 ఏళ్ల వయసున్న మహిళలు 70 శాతం మంది సొంత నిర్ణయాలు తీసుకుని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని 30 ప్రధాన నగరాల్లో మహిళలు మ్యూచువల్ ఫండ్స్, షేర్స్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారని.. ఇతర నగరాలు, పట్టణాలకు చెందిన మహిళలు ఫండ్స్, డిపాజిట్లు, బంగారం వంటి వాటిలో పెట్టుబడి పెడుతున్నారని తేలింది. ఈ లెక్కన పురుషులతో పోలిస్తే మహిళలే డబ్బు పొదుపు చేస్తున్నారు. వారి దగ్గరే సంపద అధికంగా ఉంది.