iDreamPost
android-app
ios-app

Marriage:పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలా డబ్బు ఆదా చేసుకోవచ్చు!

  • Published Nov 01, 2024 | 6:05 PM Updated Updated Nov 01, 2024 | 6:05 PM

Marriage: పెళ్లి అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. కానీ ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది.

Marriage: పెళ్లి అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. కానీ ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది.

Marriage:పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలా డబ్బు ఆదా చేసుకోవచ్చు!

పెళ్లి.. ప్రతి వ్యక్తి జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ప్రతి మనిషి జీవితంలో జరిగే అతి ముఖ్యమైన శుభకార్యం. అందుకే పెళ్ళిని చాలా ఘనంగా జరుపుకుంటారు అందరూ. ముఖ్యంగా మన భారతదేశంలో పెళ్లి అంటే ఓ ఎమోషన్. అందుకే పెళ్ళిపై అన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. మన దేశంలో తల్లిదండ్రులు.. పిల్లల పెళ్ళిళ్ళని అంగరంగ వైభవంగా జరుపుతూ ఉంటారు. అందుకోసం ఖర్చు ఎక్కువైనా వెనకాడరు. అయితే ఒకప్పుడు పెళ్ళికి పెద్దగా ఖర్చయ్యేది కాదు. ముఖ్యంగా పల్లెటూర్లలో చేసే పెళ్లికి అంత ఎక్కువ ఖర్చు అయ్యేది కాదు. కానీ ఈ రోజుల్లో పెళ్లి అంటే భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఎంతలా అంటే మనం కష్టపడి సంపాదించిన డబ్బంతా సరిపోకపోగా తిరిగి అప్పు చేసేంతలా ఖర్చు చేయాలి.

వెడ్డింగ్ ప్లానర్‌ను తీసుకోవడం దగ్గర్నుంచి.. వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డుల డిజైన్, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం, బట్టలు, గిఫ్టులు తీసుకోవడం, వివాహానికి అతిథుల లిస్ట్ తయారు చేసుకోవడం, ఫంక్షన్ హాల్, మెనూ ఎంచుకోవడం, హనీమూన్‌ డెస్టినేషన్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఖర్చులుంటాయి. వీటిని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోకపోతే ఖర్చులు తడిసి మోపడవుతాయి. ప్రస్తుతం చాలా మంది కూడా ఇంటి దగ్గర పెళ్లి పందిరి వేసుకొని పెళ్లి చేసుకోకుండా ఫంక్షన్ హాల్లో చేసుకోవాలని ఆశ పడుతున్నారు. దాని వల్ల ఖర్చు ఎక్కువవుతుంది. సిటీలల్లో బ్రతికే వారు ఫంక్షన్ హాల్ లో చేసుకోవడానికే ఎక్కువ ఇష్టపడతారు. పెళ్లిలో ఫంక్షన్ హాల్ కి, కేటరింగ్ కి ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. కానీ ఇప్పుడు చెప్పే చిన్న ట్రిక్ ని అప్లై చేయడం వల్ల వీటిపై మీరు చాలా వరకు ఖర్చు తగ్గించుకోవచ్చు.

మనలో చాలా మంది కూడా పెళ్లి చేసుకునేటప్పుడు ఫంక్షన్ హాల్ ని సపరేట్ గా బుక్ చేసుకుంటారు. కేటరింగ్ సపరేట్ గా మాట్లాడుకుంటారు. ఇలా చేస్తే ఖర్చు తక్కువ అవుతుందని భావిస్తారు. కానీ అలా జరగదు. ఖర్చు ఇంకా ఎక్కువ అవుతుంది. దానికి కారణం GST. ఫంక్షన్ హాల్ సపరేట్ గా తీసుకుంటే 18% GST పడుతుంది. ఇక కేటరింగ్ సపరేట్ గా తీసుకుంటే దానికి 5% GST పడుతుంది. కానీ ఈ రెండింటి కాంట్రాక్ట్ ని మీరు ఓకే వెండార్ కి ఇవ్వడం వల్ల మీకు కేవలం 5% GST మాత్రమే పడుతుంది. దీనివల్ల మీకు చాలా డబ్బు సేవ్ అవుతుంది. చాలా ఫంక్షన్ హాల్స్ మానేజ్ మెంట్ వారు కూడా ఈ విషయాన్ని చెప్పరు. కొంతమంది వెండార్స్ అయితే ఫంక్షన్ హాల్, కేటరింగ్ రెండు కాంట్రాక్ట్ తీసుకొని 18% GST వేసి మోసం చేస్తారు. కానీ అలా ఎప్పుడు మోసపోకండి. ఇలా ఒకే వెండార్ కి ఫంక్షన్ హాల్, కేటరింగ్ ఇచ్చినప్పుడు వాటి ఖర్చుపై కేవలం 5% మాత్రమే GST కట్టండి. జాగ్రత్తగా ఉండండి. ఇలా GST సేవ్ చేసుకోవడం వల్ల మీకు లక్షల్లో డబ్బులు ఆదా అవుతాయి. ఇక ఈ సమాచారం గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.