iDreamPost
android-app
ios-app

Wipro: విప్రో షాకింగ్ ప్రకటన.. ఆ నియామకాలన్నీ రద్దు.. 30 నెలలు వెయిట్ చేయించి మరీ

  • Published Aug 30, 2024 | 2:45 AM Updated Updated Aug 30, 2024 | 2:45 AM

Wipro Rescind Fresher Offer Letters: ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ అయిన విప్రో ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. వారి నియామకాలన్నీ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

Wipro Rescind Fresher Offer Letters: ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ అయిన విప్రో ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. వారి నియామకాలన్నీ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

  • Published Aug 30, 2024 | 2:45 AMUpdated Aug 30, 2024 | 2:45 AM
Wipro: విప్రో షాకింగ్ ప్రకటన.. ఆ నియామకాలన్నీ రద్దు.. 30 నెలలు వెయిట్ చేయించి మరీ

గత కొంతకాలంగా ఐటీ రంగంలో తీవ్ర సంక్షోభం నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. స్టార్టప్ కంపెనీలు సహా.. చాలా వరకు ఎంఎన్సీలు ఉద్యోగులను తొలగించాయి. కరోనా సమయంలో భారీ ఎత్తున ఉద్యోగులను నియమించుకున్న కంపెనీలు.. ఇప్పుడు వారిని తొలగిస్తున్నాయి. ఏవో కొన్ని కంపెనీల్లో తప్ప.. మిగతా అన్ని చోట్ల.. తీవ్ర సంక్షోభం నెలకొని ఉంది. మరోసారి నియామకాలు ఆగిపోయాయి. ఈ క్రమంలో తాజాగా ఐటీ దిగ్గజ కంపెనీ విప్రో ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. వారి నియామకాలన్ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..

ఐటీ దిగ్గజ కంపెనీ విప్రో.. ఫ్రెషర్లకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. గతంలో అనగా దాదాపు రెండున్నరేళ్ల కిందట అంటే సుమారు 30 నెలల క్రితం ఫ్రెషర్లకు ఇచ్చిన నియామక పత్రాలను (ఆఫర్ లెటర్స్) ఇప్పుడు రద్దు చేసింది. విప్రో.. ఇన్నాళ్లుగా వారిని ఉద్యోగంలోకి తీసుకోలేదు.. ఆఫీసులకు పిలవలేదు.. జీతం ఇవ్వలేదన్నమాట. తీసుకుంటాం తీసుకుంటాం అని గడువు పొడిగిస్తూ వచ్చి.. తీరా ఇప్పుడు చేతులెత్తేసింది విప్రో. ఆఫర్ లెటర్స్ ఇచ్చిన దాదాపు 30 నెలల తర్వాత విప్రో ఇప్పుడు వాటి రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. విప్రో తీసుకున్న నిర్ణయంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

wipro

నియామకాలు రద్దు చేయడం మాత్రమే కాక.. అందుకు విప్రో చెప్పిన కారణం.. వారి ఆగ్రహాన్ని మరింత పెంచుతుందు. సదరు అభ్యర్థులంతా.. తాము తప్పనిసరి చేసిన ప్రీ స్కిల్ ట్రైనింగ్ పూర్తి చేయలేకపోయారని.. అర్హత ప్రమాణాలు చేరుకోవడంలో ఫ్రెషర్లు విఫలమైనట్లు చెప్పుకొచ్చింది. ఈ విషయాలను నియమాకాలు రద్దు చేసిన సదరు అభ్యర్థుల అంతర్గత మెయిల్స్‌లో వెల్లడించింది. విప్రోలో ఉద్యోగం రావడం పట్ల సంతోషంగా ఉన్న ఆ అభ్యర్థులందరూ.. ఇప్పుడు తమను ఇలా అర్ధాంతరంగా తొలగిస్తూ.. ప్రకటన చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్ల నిరీక్షణ, కఠోర శిక్షణ అనంతరం.. ఇలా చేయడం ఏ మాత్రం భావ్యం కాదని సోషల్ మీడియా, లింక్డ్ఇన్ వేదికగా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ అంశంపై విప్రో తమ రొటీన్ ఆన్ బోర్డింగ్ ప్రక్రియలో భాగంగానే.. నైపుణ్యాల్ని సమగ్రంగా పరిశీలిస్తామని.. తద్వారా తమ నెక్ట్స్ జెన్ అసోసియేట్లు సరైన ప్రాజెక్టులకు కేటాయించేట్లుగా ప్లాన్ చేస్తామని వెల్లడించింది. లేటెస్ట్ టెక్నాలజీల్లో వారికి ప్రావీణ్యం ఉండేలా చూసుకుంటామని.. క్లయింట్స్ అవసరాలకు అనుగుణంగా ప్రతి ఎంట్రీ లెవెల్ ఉద్యోగి సరైన నైపుణ్యాల్ని ప్రదర్శించాలని ఆశిస్తామని పేర్కొంది. ఆ పారామీటర్లు అందుకోవడంలో విఫలమైన వారికి భంగపాటు తప్పదని వివరణ ఇచ్చింది.