iDreamPost
android-app
ios-app

కొడుకులకు రూ.500 కోట్లు గిఫ్ట్‌ ఇచ్చిన అజిమ్‌ ప్రేమ్‌ జీ.. ఎందుకంటే

  • Published Jan 25, 2024 | 12:51 PM Updated Updated Jan 25, 2024 | 12:51 PM

Azim Premji: ఇప్పటి వరకు దాతృత్వ కార్యక్రమాలతో వార్తల్లో నిలిచిన అజిమ్‌ ప్రేమ్‌జీ తాజాగా అందుకు భిన్నమైన పని చేసి వార్తల్లో నిలిచారు. ఆ వివరాలు..

Azim Premji: ఇప్పటి వరకు దాతృత్వ కార్యక్రమాలతో వార్తల్లో నిలిచిన అజిమ్‌ ప్రేమ్‌జీ తాజాగా అందుకు భిన్నమైన పని చేసి వార్తల్లో నిలిచారు. ఆ వివరాలు..

  • Published Jan 25, 2024 | 12:51 PMUpdated Jan 25, 2024 | 12:51 PM
కొడుకులకు రూ.500 కోట్లు గిఫ్ట్‌ ఇచ్చిన అజిమ్‌ ప్రేమ్‌ జీ.. ఎందుకంటే

తల్లిదండ్రులు కష్టపడేది బిడ్డల భవిష్యత్తు కోసమే. వారికి మంచి జీవితాన్ని అందివ్వాలని.. ఆస్తులు సంపాదించి ఇవ్వాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. వారికి చేతనైన మేర బిడ్డలకు ఆర్థిక భద్రత కల్పిస్తారు. బాగా ధనవంతులైతే.. వేల కోట్ల రూపాయల ఆస్తులను పిల్లలకు వారసత్వంగా అందిస్తారు. ఈ క్రమంలో తాజాగా ఓ తండ్రి.. తన ఇద్దరు కొడుకులకు సుమారు 500 కోట్ల రూపాయల ఆస్తులను గిఫ్ట్‌గా ఇచ్చాడు. సదరు తండ్రి తీసుకున్న నిర్ణయం దేశంలోనే సంచలనంగా మారింది. మరి ఇంతకు ఎవరా తండ్రి.. ఎందుకు కొడుకులకు ఇంత భారీ మొత్తం గిఫ్ట్‌గా ఇచ్చాడంటే..

వ్యాపారవేత్త, ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ విప్రో ఫౌండర్ అయిన అజీమ్ ప్రేమ్‌జీ తన ఇద్దరు కుమారులకు 500 కోట్ల రూపాయలు గిఫ్ట్‌గా ఇచ్చి వార్తల్లో నిలిచారు. దాదాపు కోటికిపైగా షేర్లను తన కుమారులు ఇద్దరికీ చెరి సగం బహుమతిగా ఇచ్చారు అజిమ్‌ ప్రేమ్‌జీ. ఈ షేర్ల విలువ దాదాపు రూ. 500 కోట్లుగా ఉంటుందని అంచనా. జనవరి 20న ప్రేమ్‌జీ తన కుమారులు రిషద్ ప్రేమ్‌జీ, తారిఖ్ ప్రేమ్‌జీకి 51,15,090 (51 లక్షలకుపైగా) షేర్ల చొప్పున గిఫ్ట్ ఇచ్చారు. మొత్తం ఇవి 10.2 మిలియన్ షేర్లు అని స్టాక్ ఎక్స్చేంజి ఫైలింగ్ ద్వారా తెలిసింది.

azim premzi

ఇక అజిమ్‌ ప్రేమ్‌ జీ కుమారుల్లో ఒకరైన రిషద్ ప్రేమ్‌జీ ప్రస్తుతం విప్రో కంపెనీ ఛైర్మన్‌గా ఉండగా.. మరో కొడుకు తారిఖ్ అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌‌లో పని చేస్తున్నారు. అజీమ్ ప్రేమ్‌జీ ఎండో‌మెంట్ ఫండ్ వైస్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం విప్రో షేరు రూ. 474 లెవెల్స్‌లో ఉంది. మార్కెట్ విలువ ప్రస్తుతం రూ. 2.47 లక్షల కోట్లుగా ఉంది. విప్రో సంస్థలో ప్రేమ్‌జీ కుటుంబానికి 4.43 శాతం షేర్లు ఉన్నాయి. దీంట్లో అజీమ్ ప్రేమ్‌జీ వాటానే 4.12 శాతం కాగా.. ఆయన భార్య యాస్మిన్ వాటా 0.05 శాతంగా ఉంది. ఇద్దరు కుమారులకు 0.13 శాతం చొప్పున షేర్లు ఉన్నాయి.

వ్యాపారవేత్తగా కన్నా కూడా.. దాతృత్వం విషయంలో ముందుండి నిత్యం వార్తల్లో నిలుస్తారు అజీమ్ ప్రేమ్‌జీ. దేశంలో ఏవైనా విపత్తులు వచ్చినా.. నిరుపేదలను ఆదుకోవాలన్నా ఆయనే ముందుంటారు. వేల కోట్ల సంపదను సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తుంటారు. 2019లో తన సంపదలో మూడింట రెండొంతులు విరాళం ఇవ్వడం విశేషం. వీటిల్లోనే విప్రో నుంచి పొందిన ఇతర ఆదాయాలు (బైబ్యా్క్స్, డివిడెండ్లు) కూడా ఉన్నాయి.ఇక ఆయన వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. అజిమ్‌ ప్రేమ్‌ జీ 21 ఏళ్ల వయసులోనే విప్రో ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం అజీమ్ ప్రేమ్‌జీ నికర సంపద 11.3 బిలియన్ డాలర్లుగా అంటే. దాదాపు రూ. 93 వేల కోట్లుగా ఉంది. దీంట్లోనే విప్రోలో 1.3 బిలియన్ డాలర్ల విలువైన షేర్లు ఉన్నాయి.