iDreamPost
android-app
ios-app

JSW MG నుండి విండ్సర్ ఎలక్ట్రిక్ కార్! అదిరిపోయే రేంజ్, సూపర్ ఫీచర్స్!

  • Published Aug 21, 2024 | 12:14 PM Updated Updated Aug 21, 2024 | 12:14 PM

JSW MG Windsor EV: ఎలక్ట్రిక్ కార్ల వినియోగం బాగా పెరిగిపోవడంతో JSW MG కస్టమర్లను ఆకట్టుకోవడానికి సూపర్ ఫీచర్లతో విండ్సర్ ఎలక్ట్రిక్ కార్ ని రంగంలోకి దింపింది.

JSW MG Windsor EV: ఎలక్ట్రిక్ కార్ల వినియోగం బాగా పెరిగిపోవడంతో JSW MG కస్టమర్లను ఆకట్టుకోవడానికి సూపర్ ఫీచర్లతో విండ్సర్ ఎలక్ట్రిక్ కార్ ని రంగంలోకి దింపింది.

JSW MG నుండి విండ్సర్ ఎలక్ట్రిక్ కార్! అదిరిపోయే రేంజ్, సూపర్ ఫీచర్స్!

JSW MG మోటార్ నుండి వస్తున్న లేటెస్ట్ ఎలక్ట్రిక్ కార్ విండ్సర్ EV. ఈ కార్ సెప్టెంబర్ 11న భారత మార్కెట్లోకి ప్రవేశిస్తుంది. విండ్సర్ EV అందించే కొన్ని అద్భుతమైన ఫీచర్లను కంపెనీ ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ లో చూపించింది. ఆ టీజర్ ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులో ఆకట్టుకున్న సూపర్ ఫీచర్ ఏంటంటే సన్ రూఫ్. ఇది ఇన్ఫినిటీ వ్యూ గ్లాస్ రూఫ్‌గా డిజైన్ చేయబడింది. ఇది ఎంతో విశాలమైన పనోరమిక్ సన్‌రూఫ్. ఈ కార్ కి ఉన్న బెస్ట్ ఫీచర్లలో ఇది ఒకటి. ఇదొక ఈ సింగిల్ పేన్, ఫిక్స్‌డ్ గ్లాస్ రూఫ్. ఇది సన్ రూఫ్ ని ఇష్టపడేవారికి మంచి అనుభూతిని ఇస్తుంది. ఇది నార్మల్ సన్‌రూఫ్‌ లాగా కాకుండా ఒక ప్రత్యేకమైన డిజైన్ తో తయారు చేయబడిందని తెలుస్తుంది.

ఇంకా అలాగే విండ్సర్ EV.. డ్రైవింగ్ అనుభవాన్నిమెరుగుపరచడానికి అనేక అప్డేటెడ్ ఫీచర్లను కలిగి ఉంటుందని తెలుస్తుంది. ఈ కారులో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు మల్టీఫంక్షనల్ టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంటాయి. ఇంకా అలాగే ఈ కార్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంటుందని తెలుస్తుంది. అలాగే ఈ కార్ యాంబియంట్ లైటింగ్‌ను కలిగి ఉంటుంది. ఈ కార్ కి ఉన్న స్పెషల్ ఫీచర్లలో ఒకటి వాలుగా ఉన్న బ్యాక్‌సీట్‌లు. ఈ సీట్స్ 135-డిగ్రీల యాంగిల్లో వెనుకకు వంగి ఉంటాయి. కావాలంటే వీటిని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అందువల్ల ఇందులో ప్రయాణీకులు అత్యంత సౌకర్యంగా ప్రయాణించవచ్చని తెలుస్తుంది.

JSW MG మోటార్.. ఈ కార్ కి సంబంధించి ఇంకా పూర్తి వివరాలను వెల్లడించలేదు. అయితే కొన్ని నివేదికల నుంచి తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ విండ్సర్ EV 50.6 kWh బ్యాటరీ ప్యాక్‌తో అందించబడుతుందని తెలుస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్ అనేది ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కార్ ని ఒక సారి ఛార్జ్ చేస్తే ఏకంగా 460 కిలోమీటర్ల వరకు సూపర్ రేంజిని అందించగలదని సమాచారం తెలుస్తుంది. ఇందులో DC ఫాస్ట్ ఛార్జింగ్‌ ఆప్షన్ వుంది. దీంతో కేవలం 30 నిమిషాల్లో 30 శాతం నుండి పూర్తిగా రీఛార్జ్ అవ్వగలదు. దీని పనితీరు చాలా బాగుంటుంది. విండ్సర్ EV దాదాపుగా 134 bhp మరియు 200 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా ఎన్నో అద్భుతమైన ఫీచర్లతో రాబోతున్న ఈ కార్ ధర విషయానికి వస్తే.. కేవలం 20 లక్షల లోపే ఉంటుందని సమాచారం తెలుస్తుంది.