iDreamPost
android-app
ios-app

ఇకపై బ్యాంక్, ATMకు వెళ్లకుండానే ఇంటికే డబ్బులు.. ఎలా అంటే?

  • Published Apr 09, 2024 | 1:55 PM Updated Updated Apr 09, 2024 | 1:57 PM

చాలా సందర్భాల్లో ఆన్‌‌లైన్ ట్రాన్సాక్షన్స్ పనిచేయకపోవడం.. చేతిలో సరిపడా డబ్బులు లేకపోవడం వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. అలాంటి సమయంలో.. అర్జెంట్‌గా మనీని ఏకంగా ఇంటికే పొందే కొత్త సర్వీస్ ను ఐపీపీబీ సంస్థ తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చింది.

చాలా సందర్భాల్లో ఆన్‌‌లైన్ ట్రాన్సాక్షన్స్ పనిచేయకపోవడం.. చేతిలో సరిపడా డబ్బులు లేకపోవడం వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. అలాంటి సమయంలో.. అర్జెంట్‌గా మనీని ఏకంగా ఇంటికే పొందే కొత్త సర్వీస్ ను ఐపీపీబీ సంస్థ తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చింది.

  • Published Apr 09, 2024 | 1:55 PMUpdated Apr 09, 2024 | 1:57 PM
ఇకపై బ్యాంక్, ATMకు వెళ్లకుండానే ఇంటికే డబ్బులు.. ఎలా అంటే?

ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసిన అంతా డిజిటల్ పేమెంట్స్‌ హవానే జోరుగా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే..చిన్నటీ కొట్టు నుంచి షాపింగ్ మాల్స్ వరకు ఏది కొనుగోలు చేసినా.. ఆన్‌‌లైన్ ట్రాన్సాక్షన్స్ ప్రొసెస్ నే అనుసరిస్తున్నారు. అయితే ఈ ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ వినియోగిస్తున్నప్పటికి చేతిలో ఎంతో కొంత నగదును కచ్చితంగా ఉంచుకోవాలి. ఎందుంటే.. కొన్ని సందర్భాల్లో ఈ డిజిటల్ పేమంట్స్ అవ్వకపోవడం వలన అర్జెంట్ గా డబ్బుల అవరసరం పడుతుంది.అలాంటి సమయంలో చేతిలో సరిపడా డబ్బులు లేకపోవడంతో.. ప్రతిఒక్కరూ బ్యాంక్స్, ఏటీఎంకు పరుగులు తీస్తారు. అయితే అన్నీ సందర్భాల్లో ఈ బ్యాంక్, ఏటీఎంకు వెళ్లేంత సమయం లేకపొవచ్చు. అప్పుడు చేతిలో డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాంటి సమయంలో అర్జెంట్‌గా మనీని ఏకంగా ఇంటికే పొందే కొత్త సర్వీస్ ను ఐపీపీబీ సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

చాలా సందర్భాల్లో ఆన్‌‌లైన్ ట్రాన్సాక్షన్స్ పనిచేయకపోవడం.. చేతిలో సరిపడా డబ్బులు లేకపోవడం వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. అలాంటి సమయంలో.. అర్జెంట్‌గా మనీని ఏకంగా ఇంటికే పొందే కొత్త సర్వీస్ ను ఐపీపీబీ సంస్థ తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చింది.అయితే ఇండియా పోస్టు పేమెంట్స్ బ్యాంకు (IPPB).. ఆన్‌లైన్ ఆధార్ ATM అనే కొత్త సర్వీస్ ను ప్రవేశపెట్టింది. అంతేకాకుండా.. తాజాగా ఐపీపీబీ దీని గురించి ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ ద్వారా వెల్లడించింది. పైగా అందులో.. మీకు అర్జెంట్‌గా డబ్బులు కావాలా? పైగా బ్యాంకుకు మీరు వెళ్లేంత సమయం కూడా లేదా? అయితే ఇకపై ఆ ఇబ్బందులే ఉండవు. ఇక నుంచి IPPBONLINE Aadhaar ATM (AePS) సర్వీస్‌తో ఎటు వెళ్లాల్సిన పని లేకుండా.. చక్కగా ఇంటి దగ్గర నుంచే క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు. అది కూడా డోర్‌స్టెప్ సర్వీస్ ద్వారా క్యాష్ విత్‌డ్రా చేసుకునేందుకు పోస్ట్‌మ్యాన్ మీకు సహాయం చేస్తాడు. అందుచేతనే ఇప్పుడే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.’ అని ఐపీపీబీ ఎక్స్ లో తెలిపింది. అలాగే ఇతర సమాచారం కోసం ఈ వెబ్‌సైట్‌ను సందర్శించండి  అని పోస్ట్ చేశారు.

ఇక ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AePS) ద్వారా ఎవరైనా డబ్బులు కావాలనుకునే వ్యక్తి వారి బయోమెట్రిక్ ఉపయోగించడం ద్వారా క్యాష్ తీసుకోవచ్చు. ఇంకా ఆధార్ లింక్డ్ అకౌంట్ ద్వారా పేమెంట్లు కూడా చేయొచ్చు. అంతేకాకుండా..  AePS సర్వీస్ ద్వారా కస్టమర్లు చిన్న మొత్తంలో డబ్బుల్ని తీసుకోవచ్చు. దీంతో బ్యాంక్ , ATM లకు వెళ్లవలసిన అవసరం లేదు. పైగా సమయం కూడా ఆదా అవుతుంది.  అలాగే  కస్టమర్ తన ఆధార్‌ను ఉపయోగించడం ద్వారా ఐడెంటిటీ ధ్రువీకరణతో.. క్యాష్ విత్‌డ్రాయల్బ్యాలెన్స్ ఎంక్వైరీ, బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్‌మెంట్, ఆధార్ టు ఆధార్ ఫండ్ ట్రాన్స్‌ఫర్  వంటి ఇతర బేసిక్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు.

అయితే ఈ సేవలను ఎలా పొందాలంటే?

  • ePS తో అనుసంధానమై ఉన్న బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి.
  • ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి.
  • బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారానే ట్రాన్సాక్షన్ చేసుకునే సదుపాయం ఉంటుంది.
  • ఒకవేళ బ్యాంక్ అకౌంట్.. ఆధార్ కార్డుతో లింక్ కాకుంటే మాత్రం ట్రాన్సాక్షన్ డిక్లైన్ అవుతుంది.
  • దీని కోసం కచ్చితంగా ఆధార్ కార్డును మెయింటెయిన్ చేయాల్సిన పని లేదు. ఆధార్ నంబర్ ఉంటే సరిపోతుంది.
  • ఐపీపీబీ ద్వారా డోర్‌స్టెప్ సర్వీస్ ద్వారా ట్రాన్సాక్షన్స్ సక్సెస్ అయిందో లేదో SMS అలర్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. దీని కోసం కొన్ని ఛార్జీలు పడతాయి.
  • ప్రస్తుతానికి క్యాష్ విత్‌డ్రా, ట్రాన్స్‌ఫర్‌కు లిమిట్ అనేది ఏం లేదు. కానీ గరిష్టంగా రూ. 10 వేల వరకు ఉన్నట్లు తెలుస్తోంది.

మరి, ఇక నుంచి అర్జెంట్‌గా మనీ అవసరం ఉన్నప్పుడు చక్కగా ఇంటి వద్దకే ఆధార్ ATM  సర్వీస్ తో డబ్బును పొందే ఈ  కొత్త సర్వీస్ ను ఐపీపీబీ సంస్థ అందుబాటులోకి తీసుకురావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.