iDreamPost
android-app
ios-app

ఇది కదా సక్సెస్‌ అంటే.. అప్పు చేసి ఒక్క లారీ కొన్నాడు.. కట్‌ చేస్తే వేల కోట్లకు అధిపతి

  • Published Jan 10, 2024 | 12:26 PM Updated Updated Jan 10, 2024 | 12:26 PM

ప్రస్తుతం ఎంతో మంది తమకు నచ్చిన వృత్తిని చాలా సునాయాసంగా ఎంచుకుంటున్నారు. కానీ, కొన్ని దశాబ్దాల క్రితం ఇది ఎంతో కష్టమైన పని. కానీ, కుటుంబ సభ్యులను సైతం ఎదురించి ఆనాడు ఆ వ్యక్తి వేసిన ముందడుగు ఈరోజు అతనిని బిజినెస్ రంగంలో గొప్ప స్థాయిలో నిలబెట్టింది.

ప్రస్తుతం ఎంతో మంది తమకు నచ్చిన వృత్తిని చాలా సునాయాసంగా ఎంచుకుంటున్నారు. కానీ, కొన్ని దశాబ్దాల క్రితం ఇది ఎంతో కష్టమైన పని. కానీ, కుటుంబ సభ్యులను సైతం ఎదురించి ఆనాడు ఆ వ్యక్తి వేసిన ముందడుగు ఈరోజు అతనిని బిజినెస్ రంగంలో గొప్ప స్థాయిలో నిలబెట్టింది.

  • Published Jan 10, 2024 | 12:26 PMUpdated Jan 10, 2024 | 12:26 PM
ఇది కదా సక్సెస్‌ అంటే.. అప్పు చేసి ఒక్క లారీ కొన్నాడు.. కట్‌ చేస్తే వేల కోట్లకు అధిపతి

ప్రపంచంలో చాలా మంది వారు కన్న కలలు సాకారం చేసుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఆ క్రమంలో వారు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కుంటారు. కొన్ని సార్లు ఓటమిని అంగీకరించి మధ్యలోనే వారి కలలను వదిలేస్తారు. కానీ , కొంతమంది మాత్రం వారు చేయదలచుకున్న పని మీద వారికున్న నమ్మకంతో.. ఎన్ని అడ్డంకులు వచ్చినా వారి ప్రయత్నాన్ని కొనసాగించి.. చివరికి విజయాన్ని పొందుతారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఓ నిజ జీవిత గాధ కూడా ఇటువంటిదే. తాను నమ్మిన వృత్తిలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా దానిపైనే తన దృష్టిని ఉంచి.. ఈరోజు మంచి స్థాయిలో ఉన్నాడు ఈ వ్యక్తి. అతను మరెవరో కాదు VRL లాజిస్టిక్స్‌ అధినేత విజయ్ సంకేశ్వర్.

కర్ణాటకలోని ధార్వాడ్‌కు చెందిన వ్యక్తి విజయ్ సంకేశ్వర్. ఈయన బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీని పూర్తి చేశారు. విజయ్ కుటుంబం స్వతహాగా ప్రచురణ సంస్థను నడిపించేది. కానీ, విజయ్ కు మాత్రం ట్రాన్స్పోర్ట్ వ్యాపారం పైన ఎక్కువ ఆసక్తి ఉండేది. కానీ విజయ్ ఆలోచనను కుటుంబ సభ్యులు ఎవరూ కూడా సహకరించలేదు. పైగా సొంతంగా వ్యాపారం చేయడాన్ని అందరూ వ్యతిరేకించారు. కానీ, విజయ్ కు మాత్రం ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేయాలనే ఆశ చావలేదు. దీనితో కుటుంబ సభ్యులందరినీ వ్యతిరేకించి.. తానే స్వయంగా లోన్ తీసుకుని 1976లో ఒకే ఒక్క ట్రక్ కొనుగోలు చేసి తన వ్యాపారాన్ని ప్రారంభించాడు. విరాజయానంద్ ట్రావెల్స్ పేరుతో తన మొట్ట మొదటి ట్రాన్స్పోర్ట్ వ్యాపారాన్ని ప్రారంభించాడు.

Now he is the owner of thousands of crores

కాగా, ఆనాడు కేవలం ఒకే ఒక్క ట్రక్ తో తన వ్యాపారాన్ని ప్రారంభించిన అతని దగ్గర.. ఈరోజు సుమారు 5700 ట్రక్కుల వరకు ఉన్నాయి. ఈ వాహనాల సంఖ్యను చూసి చెప్పొచ్చు అతని వ్యాపారం రోజు రోజుకి ఎంత అభివృద్ధి చెందుతూ వచ్చిందో. మనం చేయాలనుకునే వృత్తి మీద మనకు నమ్మకం ఉంటే చాలని.. ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. ఎవరు అడ్డుకున్నా.. దైర్యంగా ఒక్క అడుగు ముందుకు వేస్తే మనం అనుకున్నది సాధించవచ్చని.. విజయ్ సంకేశ్వర్ నిరూపించారు. విజయానంద్ ట్రావెల్స్ గా మొదలుపెట్టిన అతని ట్రాన్స్పోర్ట్ వ్యాపారం.. ప్రస్తుతం VRL లాజిస్టిక్స్‌గా కొనసాగుతోంది.

ఇక ఇప్పుడు ఈ కంపెనీ పేరు తెలియని వారు లేరు. దేశంలో మిగిలిన అన్ని కంపెనీలకు సమానమైన పోటీని ఇస్తూ.. మంచి లాభాలతో దూసుకుపోతుంది. ఈ కంపెనీ ప్రస్తుతం చాలా రకాల కార్గో అవసరాల కోసం కొన్ని వేల ట్రక్కులను, మినీ ట్రక్కులను రన్ చేస్తూ ఉంది. దీనితో ప్రస్తుతం విజయ్ సంగేశ్వర్ దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తల్లో ఒకరిగా నిలిచారు. అంతే కాకుండా విజయ్ ను ట్రక్కింగ్ కింగ్ అఫ్ ఇండియా అని ముద్దుగా పిలుచుకుంటారు. ఈ క్రమంలో VRL లాజిస్టిక్స్‌ సంస్థ గడిచిన ఐదేళ్ళలో పెట్టుబడిదారులకు 115 శాతం రాబడిని అందించింది. అలాగే ప్రస్తుతం కంపెనీ మార్కెట్ వాల్యూ దాదాపు రూ.6,142 కోట్లకు చేరుకుంది. అంతేకాకుండా పారిశ్రామిక రంగంలో విజయ్ సంకేశ్వర్ సాధించిన విజయాలకు.. గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఏదేమైనా , విజయ్ శంఖేశ్వర్ కథ.. సొంతంగా వ్యాపారం చేద్దాం అనుకుంటున్న ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది. మరి, VRL లాజిస్టిక్స్‌ అధినేత సక్సెస్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.