Best EV Car For Middle Class People: మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం బెస్ట్ సోలార్ కార్.. ఏటా 3 వేల కి.మీ. ఫ్రీగా తిరగచ్చు!

మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం బెస్ట్ సోలార్ కార్.. ఏటా 3 వేల కి.మీ. ఫ్రీగా తిరగచ్చు!

Vayve Mobility Soon Launches India's First Ever Eva Solar Electric Car: సోలార్ కమ్ ఎలక్ట్రిక్ కారుని తీసుకొస్తుందో కంపెనీ. ఈ సోలార్ కారుతో డైలీ 10 కి.మీ. ఉచితంగా ట్రావెల్ చేయవచ్చు. ఏడాదికి 3 వేల కిలోమీటర్లు ఫ్రీగా జర్నీ చేయవచ్చు. సింగిల్ ఛార్జ్ తో 250 కి.మీ. రేంజ్ ఇస్తుంది. మరి టాప్ స్పీడ్ ఎంత? ఛార్జింగ్ టైం ఎంత? ఇతర ఫీచర్స్ ఏంటి? వంటి విషయాలు మీ కోసం.

Vayve Mobility Soon Launches India's First Ever Eva Solar Electric Car: సోలార్ కమ్ ఎలక్ట్రిక్ కారుని తీసుకొస్తుందో కంపెనీ. ఈ సోలార్ కారుతో డైలీ 10 కి.మీ. ఉచితంగా ట్రావెల్ చేయవచ్చు. ఏడాదికి 3 వేల కిలోమీటర్లు ఫ్రీగా జర్నీ చేయవచ్చు. సింగిల్ ఛార్జ్ తో 250 కి.మీ. రేంజ్ ఇస్తుంది. మరి టాప్ స్పీడ్ ఎంత? ఛార్జింగ్ టైం ఎంత? ఇతర ఫీచర్స్ ఏంటి? వంటి విషయాలు మీ కోసం.

భారత మార్కెట్లో చాలా ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ధరలు మాత్రం మధ్యతరగతి వ్యక్తులు పెట్టుకునేలా లేవు. 10 లక్షలు పైనే పలుకుతున్నాయి. దీంతో సొంత కారు కొనుక్కోవాలన్న మిడిల్ క్లాస్ వారి కల కలగానే మిగిలిపోతుంది. అయితే వేవ్ మొబిలిటీ అనే కంపెనీ భారతదేశపు మొట్టమొదటి సోలార్ ఎలక్ట్రిక్ కార్ ని తీసుకొస్తుంది. ఈ కారు స్పెషాలిటీ ఏంటంటే ప్రతి ఏటా ఫ్రీగా సోలార్ ద్వారా 3వేల కి.మీ. పొందవచ్చు. అంటే ఈ కారులో అమర్చబడిన సోలార్ టెక్నాలజీ ద్వారా 3 వేల కి.మీ. ఎలాంటి ఛార్జీలు లేకుండా ప్రయాణం చేయవచ్చు. ఇది 3 సీటర్ కెపాసిటీతో వస్తుంది. ముందు డ్రైవర్ సీటు, వెనుక ఇద్దరు కూర్చోడానికి సింగిల్ సీటు ఇచ్చారు. ఇద్దరు పెద్దవాళ్ళు, ఒక చిన్న కిడ్ కి ఇది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. 

ఆఫీసులకు, షాపింగ్ లకి, పిల్లలని స్కూల్ కి తీసుకెళ్లడానికి, స్కూల్ నుంచి తీసుకురావడానికి చిన్న చిన్న అవసరాలకు బాగా సూట్ అవుతుంది. ముఖ్యంగా లేడీస్ కి బాగా యూజ్ అవుతుంది. సింగిల్ ఛార్జ్ తో ఇది 250 కి.మీ. రేంజ్ ఇస్తుంది. 5 సెకన్లలో 0 నుంచి 40 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది 40 ఎన్ఎం టార్క్ తో వస్తుంది. ఇంటి దగ్గర సాధారణ 15 యాంపియర్స్ ప్లగ్ లో ఛార్జింగ్ పెట్టుకుంటే 4 గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ తో కూడా వస్తుంది. దీంతో 45 నిమిషాల్లోనే 80 శాతం ఛార్జింగ్ ఎక్కుతుంది. ఈ కారు మీద 3 ఏళ్లు వారంటీ లేదా లక్ష కిలోమీటర్ల వారంటీ ఇస్తున్నారు. అదనంగా 50 వేల కిలోమీటర్లకు లేదా రెండేళ్లకు వారంటీ కావాలన్నా కొనుక్కోవచ్చు. కంపెనీ ఈ కారుని గంటకు 70 కి.మీ. వేగంతో వెళ్లేలా తయారు చేస్తుంది.

బ్యాటరీతో కలిపి ఈ కారు బరువు 550 కిలోలు. ఇది ప్రయాణికులు, లగేజ్ కలిపి మొత్తం 250 కిలోల బరువును మోయగలదు. అప్పుడు మొత్తం కారు బరువు 800 కిలోలు అవుతుంది. ముందు డ్రైవర్ సీటు పక్కన 50 లీటర్ల బూట్ స్పేస్ అయితే ఇచ్చారు. వెనుక సీటుని మడతపెడితే 150 లీటర్ల బూట్ స్పేస్ వస్తుంది. ఇది మూన్ స్టోన్ వైట్, లైట్ ప్లాటినం, స్కై బ్లూ, రోజ్ కోరల్, చెర్రీ రెడ్, ఛాంపాగ్నే గోల్డ్ మొత్తం ఆరు కలర్ షేడ్స్ లో వస్తుంది. ఈ కారును డ్రైవ్ చేయాలంటే సాధారణ ఎల్ఎంవి లైసెన్స్ ఉండాలి. ఇక కిలోమీటర్ దూరానికి 80 పైసలు ఖర్చు అవుతుందని కంపెనీ తెలిపింది. ఇందులో 14 కిలోవాట్ బ్యాటరీని ఇచ్చారు. ఇందులో ఏసీ, ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్లు కనెక్ట్ చేసుకునేలా డ్యాష్ బోర్డు, 6 వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, వైడ్ డ్రైవర్ విజిబిలిటీ, పనోరమిక్ సన్ రూఫ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. మరో విశేషం ఏంటంటే డ్రైవర్ సహా ముగ్గురు ప్యాసింజర్లకి ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు. దీని చాసిస్ ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ తో వస్తుంది.

కారు ఫ్రంట్ సైడ్ డ్రైవర్ సీటుకి డోర్ స్టోరేజ్, ఫోన్ స్టోరేజ్, కప్ హోల్డర్, స్టోరేజ్ బిన్, బాటిల్ హోల్డర్, ట్రే, బ్యాగ్ హుక్ వంటివి ఇచ్చారు. ఇది చాలా చిన్నదిగా ఉంటుంది. దీని వల్ల సులువుగా పార్కింగ్ చేసుకోవచ్చు. ఇరుకు ప్రాంతాల్లో సైతం సులువుగా వెళ్లిపోవచ్చు. స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ విషయంలో కూడా కస్టమర్ కే ఐ సంతృప్తినిస్తుంది. ఈ కార్లు ఇంకా కస్టమర్లకు అందుబాటులోకి రాలేదు. కారు ధరను కూడా వాణిజ్యపరంగా లాంఛ్ చేసినప్పుడు ప్రకటిస్తామని కంపెనీ తెలిపింది. అయితే పలు మీడియా కథనాల ప్రకారం దీని ధర రూ. 5 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకూ ఉంటుందని తెలుస్తుంది. అయితే 5 లక్షల లోపు బడ్జెట్ లో వస్తే కనుక మిడిల్ క్లాస్ వారికి ఈ కారు వరమని అంటున్నారు. మరి ఈ సోలార్ కారుపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Show comments