iDreamPost
android-app
ios-app

నమూనా టెస్ట్‌లో ఫెయిలైన పతంజలి తేనె.. భారీగా జరిమానా

  • Published Apr 13, 2024 | 3:26 PM Updated Updated Apr 13, 2024 | 4:12 PM

Patanjali Honey: నమూనా పరీక్షలో పతంజలి తేనె ఫెయిల్ అయ్యింది. దాంతో భారీ ఎత్తున జరిమానా విధించారు. ఆ వివరాలు..

Patanjali Honey: నమూనా పరీక్షలో పతంజలి తేనె ఫెయిల్ అయ్యింది. దాంతో భారీ ఎత్తున జరిమానా విధించారు. ఆ వివరాలు..

  • Published Apr 13, 2024 | 3:26 PMUpdated Apr 13, 2024 | 4:12 PM
నమూనా టెస్ట్‌లో ఫెయిలైన పతంజలి తేనె.. భారీగా జరిమానా

పతంజలి ఆయుర్వేద కంపెనీకి ఈమధ్య కాలంలో వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మూడు రోజులు క్రితం సుప్రీంకోర్టు పతంజలి నిర్వాహకులు బాబా రాందేవ్, బాలకృష్ణలపై సీరియస్ అయిన సంగతి తెలిసిందే. వారి క్షమాపణలను సైతం తిరస్కరించింది. పతంజలి ఉత్పత్తుల తప్పుదోవ ప్రకటించే ప్రకటనల కేసులో అత్యున్నత న్యాయ స్థానం పతంజలి ఆయుర్వేద నిర్వాహకులపై మండిపడింది. ఇక తాజాగా పతంజలికి మరో షాక్ తగిలింది. నమూనా పరీక్షలో పతంజలి తేనె ఫెయిల్ అయ్యింది. దాంతో భారీగా జరిమానా విధించారు. ఆ వివరాలు..

ప్యాక్ చేసిన పతంజలి తేనె.. నమూనా పరీక్షలో విఫలమవ్వడంతో.. ఆ కంపెనీపై చర్యలు తీసుకున్నారు. అంతేకాక లక్ష రూపాయల జరిమానా విధించారు. నాలుగేళ్ల క్రితం ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్ జిల్లాలోని దీదీహత్ నుంచి సేకరించిన పతంజలి ప్యాక్డ్ తేనె నమూనాను పరీక్ష కోసం పంపించారు. ఈ టెస్ట్ లో పతంజలి ప్యాక్ చేసిన తేనె నమూనాలో నాణ్యత లేనిదని వెల్లడైంది. నమూనాలో సుక్రోజ్ మొత్తం రెట్టింపు కంటే ఎక్కువ ఉన్నట్లు తెలిసింది. ఇక ఈ కేసులో శుక్రవారం దీదీహత్‌లోని విక్రయదారుడికి, రాంనగర్‌కు చెందిన డిస్ట్రిబ్యూటర్ కంపెనీకి న్యాయనిర్ణేత అధికారి రూ.లక్ష జరిమానా విధించారు.

ఈ సందర్భంగా జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఆర్‌కె శర్మ మాట్లాడుతూ.. ’’నాలుగేళ్ల క్రితం అనగా.. 2020 జూలైలో మా డిపార్ట్‌మెంట్ దీదీహత్‌లోని గౌరవ్ ట్రేడింగ్ కంపెనీ నుండి ప్యాక్ చేసిన పతంజలి తేనె నమూనాను సేకరించారు. దాన్ని నాణ్యతను పరీక్షించడం కోసం రుద్రాపూర్‌లోని ల్యాబ్‌కు పంపించారు. ఈ పరిశోధనలో పతంజలి ప్యాక్ చేసిన తేనెలో సుక్రోజ్ లెవల్స్ అధికంగా ఉన్నట్లు తెలిసింది. ప్రామాణిక ఐదు శాతానికి బదులుగా పతంజలి ప్యాక్ చేసిన తేనెలో సుక్రోజ్ లెవల్స్ దాదాపు రెట్టింపు అనగా.. 11.1 శాతం ఉన్నట్లు వెల్లడైంది‘‘ అని తెలిపారు.

నవంబర్ 2021లో సంబంధిత విక్రేతపై డిపార్ట్‌మెంట్ దావా వేసింది. ఈ క్రమంలో తాజాగా శుక్రవారం నాడు అనగా ఏప్రిల్ 12న న్యాయనిర్ణేత అధికారి, ఏడీఎం డాక్టర్‌ ఎస్‌కే బరన్‌వాల్‌ తీర్పు వెలువరించారు. ప్రొడక్ట్ సెల్లర్ గౌరవ్ ట్రేడింగ్ కంపెనీకి రూ.40 వేలు, సూపర్ స్టాకిస్ట్ కన్హాజీ డిస్ట్రిబ్యూటర్ రాంనగర్‌కు రూ.60 వేలు జరిమానా విధించారు.