Dharani
UPI Payments: యూపీఐ పేమెంట్స్ పెరిగాక.. చెల్లింపుల ప్రక్రియ చాలా సులభతరం అయ్యింది.. అనేక సమస్యలు పరిష్కారం అయ్యాయి. దాంతో పాటు.. ఇవి జేబుకు చిల్లుపెడుతున్నాయని తాజాగా వెల్లడైంది. ఆ వివరాలు..
UPI Payments: యూపీఐ పేమెంట్స్ పెరిగాక.. చెల్లింపుల ప్రక్రియ చాలా సులభతరం అయ్యింది.. అనేక సమస్యలు పరిష్కారం అయ్యాయి. దాంతో పాటు.. ఇవి జేబుకు చిల్లుపెడుతున్నాయని తాజాగా వెల్లడైంది. ఆ వివరాలు..
Dharani
నేటి కాలంలో ప్రతిది ఆన్‌లైన్ అయ్యింది. అగ్గిపెట్టె దగ్గర నుంచి వాషింగ్ మెషిన్ల వరకు ప్రతి దాన్ని ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేస్తున్నాం. ఇక యూపీఐ యాప్స్ వినియోగం పెరిగాక.. చేతిలో డబ్బుల పట్టుకు తిరగడం చాలా వరకు తగ్గిపోయింది. రోడ్డు పక్కన దుకాణాలు మొదలు.. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ఎక్కడ చూసినా ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. స్టార్మ్ ఫోన్ తీశామా.. స్కాన్ చేశామా.. పేమెంట్ చేశామా.. అంతే. చిల్లర సమస్య లేదు.. దొంగ నోట్ల ప్రసక్తి లేదు. అయ్యో పర్స్ మర్చిపోయాం.. డబ్బులు తేలేదు అన్న ఇబ్బంది లేదు. యూపీఐ చెల్లింపుల వల్ల కొనుగోళ్లు చాలా సౌకర్యవంతం అయ్యాయి అని చెప్పవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు యూపీఐ చెల్లింపుల వ్యవస్థను స్వీకరిస్తున్నాయి.
అయితే ఇది నాణానికి ఒకవైపు మాత్రమే అంటున్నారు. డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి రావటం వల్ల నగదు లావాదేవీలను చాలా సులభతరం అయ్యాయి. దాంతో పాటు ప్రజలు తమ డబ్బును ఖర్చు చేసే విధానంపై భారీ ప్రభావాన్ని చూపుతున్నట్లు నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం చూసుకుంటే.. యూపీఐ యాప్స్.. జనాల జేబులకు చిల్లు పెడుతున్నాయంటూ షాకింగ్ విషయాలు వెల్లడించింది. ఇంద్రప్రస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఢిల్లీ అనే సంస్థ భారతదేశంలో యూపీఐ చెల్లింపులపై చేసిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి.
ఈ నివేదికలో.. యూపీఐ, ఇతర డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌లు నగదు బదిలీ ప్రక్రియను మునుపటి కంటే చాలా సులభతరం చేశాయని అనేక మంది ప్రజలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారట. ఇది ఒకవైపు మాత్రమే అని.. మరో వైపు ఈ యూపీఐ యాప్స్ వల్ల డబ్బు ఖర్చు చేసే వియంలో.. జనాలు కంట్రోల్లో ఉండటం లేరనే షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో అయితే బయటకు వెళ్తే.. ఖర్చులకు సరిపడా డబ్బులు పట్టుకెళ్లేవాళ్లం.
ఎంత నగదు తీసుకెళ్లామో అంత మేర లేదంటే ఇంకా తగ్గించి ఖర్చు చేసుకుని వచ్చే వాళ్లం. కానీ యూపీఐ పేమెంట్స్ పెరగడంతో.. ఈ కంట్రోలింగ్ విధానం దెబ్బ తిన్నది. మనసుకు నచ్చినవి కొంటున్నం.. స్కాన్ చేసి.. పేమెంట్ చేస్తున్నాం. దాంతో ఖర్చుల మీద అదుపు లేకుండా పోతుంది. ఫలితంగా యూపీఐ చెల్లింపుల వల్ల ప్రజలు అనవసర ఖర్చులు ఎక్కువగా చేస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.
తాజా అధ్యయనం ప్రకారం యూపీఐ, ఇతర డిజిటల్ చెల్లింపు పద్ధతులను ఉపయోగించడం వల్ల భారతదేశంలో 75 శాతం మంది ప్రజలు ఎక్కువ ఖర్చు చేశారని వెల్లడైంది. సర్వే ప్రకారం దాదాపు 81 శాతం మంది వ్యక్తులు రోజువారీగా యూపీఐ యాప్స్ ద్వారా లావాదేవీలు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే యూపీఐ వల్ల చెల్లింపులు సులభతరంగా మారాయని 91.5 శాతం మంది ప్రజలు వెల్లడించారు.
ఇదే క్రమంలో వ్యక్తులు యూపీఐ ద్వారా సగటు రోజుకు రూ.200 ఖర్చు చేస్తున్నట్లు వెల్లడైంది. ఏప్రిల్ మాసంలో యూపీఐ లావాదేవీల సంఖ్య దేశంలో 1,330 కోట్లకు చేరుకున్నాయి. ఏడాది ప్రాతిపదికన యూపీఐ లావాదేవీల సంఖ్య 50 శాతం పెరిగింది. యూపీఐ యాప్స్ వల్ల ప్రయోజనాల సంగతి మాట అటుంచితే.. జనాల చేత విపరీతంగా ఖర్చు చేయిస్తూ.. జేబుకు చిల్లు పెడుతున్నాయని నివేదిక వెల్లడించింది.