P Venkatesh
Amazon Prime Day Sale: ఆన్ లైన్ ద్వరాా వస్తువులు కొనాలనుకునే యూజర్లకు అదిరిపోయే డీల్స్ అందించనుంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో ఏకంగా 80 శాతం తగ్గింపు ఇవ్వనుంది.
Amazon Prime Day Sale: ఆన్ లైన్ ద్వరాా వస్తువులు కొనాలనుకునే యూజర్లకు అదిరిపోయే డీల్స్ అందించనుంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో ఏకంగా 80 శాతం తగ్గింపు ఇవ్వనుంది.
P Venkatesh
ఈ కామర్స్ సంస్థలు అందుబాటులోకి వచ్చాక అంతా ఆన్ లైన్ ద్వారానే పర్చేజ్ చేస్తున్నారు. ఏ వస్తువులు కావాలన్నా ఆన్ లైన్ ప్లాట్ ఫాంలనే ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో షాపింగ్ మాల్స్ కు వెళ్లి కావాల్సిన వస్తువులను కొనే పరిస్థితి లేదు. అందుకే ఇంటివద్ద నుంచే బుక్ చేసుకుని వస్తువులను ఇంటికి తెప్పించుకుంటున్నారు. అదీకాక ఈ కామర్స్ సంస్థలు అందించే డిస్కౌంట్ ఆఫర్లను యూజ్ చేసుకునేందుకు ఆన్ లైన్ షాపింగ్ కే మొగ్గు చూపుతున్నారు. మరి మీరు కూడా ఆన్ లైన్ షాపింగ్ చేసేందుకు రెడీ అవుతున్నారా? ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ భారత్ లో ప్రైమ్ డే సేల్ ను ప్రకటించింది. ఈ సందర్భంగా వేలాది ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్ అందించనున్నది. మరి ఇప్పటి నుంచే మీకు కావాల్సిన వస్తువుల లిస్ట్ ను రెడీ చేసుకోండి.
అమెజాన్ ప్రైమ్ డే సేల్ జులై 20 నుంచి ప్రారంభం కానున్నది. జూలై 20, 2024 అర్ధరాత్రి ప్రారంభమవుతుంది. జూలై 21, 2024 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ సమయంలో ఎలక్ట్రానిక్స్ నుంచి గృహోపకరణాల వరకు ప్రతి వస్తువుపై భారీ డిస్కౌంట్ పొందవచ్చు. అయితే ఈ ఆఫర్స్ అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ఉన్నవాళ్లకు మాత్రమే అందుబాటులో ఉండనున్నది. ప్రత్యేక కార్డ్ డిస్కౌంట్‌లు, కూపన్ ఆఫర్‌లతో భారీ తగ్గింపులతో వస్తువులను కొనుగోలు చేయొచ్చు. ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చు.
అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో ఐసీఐసీఐ, ఎస్‌బీఐ డెబిట్/ క్రెడిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్ అందుకోవచ్చు. ఐసీఐసీఐ, అమెజాన్ పే క్రెడిట్ కార్డు వినియోగదారులకు 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. కొత్తగా ఈ కార్డు తీసుకునే వారికి ప్రైమ్ మెంబర్లకు వెల్‌కమ్ రివార్డుల కింద రూ.2,500 వరకు ప్రయోజనాలు కలుగనున్నాయి. నాన్ ప్రైమ్ మెంబర్లకు రూ.2 వేల వరకు ప్రయోజనాలతో పాటు 3 నెలల పాటు ప్రైమ్ మెంబర్ షిప్ ఇస్తోంది. మీరు అమెజాన్ పే ని ఉపయోగించి పేమెంట్ చేయడం ద్వారా 40% వరకు తగ్గింపు పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా పాత ప్రొడక్ట్ లను ఎక్సేంజ్ చేయడం ద్వారా కొత్త ప్రొడక్టులపై రూ. 50,000 వరకు సేవ్ చేసుకోవచ్చు.