iDreamPost
android-app
ios-app

బడ్జెట్‌లో ట్యాక్స్ పేయర్స్‌కు గుడ్ న్యూస్.. భారీ ఊరట

New Tax Slabs in Budget 2024-25.. ఈ ఏడాది పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఫిబ్రవరిలో ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టింది కేంద్రం. ఇప్పుడు పూర్తి స్థాయిలో పద్దును తీసుకు వచ్చింది. అయితే వేతన జీవులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న శ్లాబుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.

New Tax Slabs in Budget 2024-25.. ఈ ఏడాది పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఫిబ్రవరిలో ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టింది కేంద్రం. ఇప్పుడు పూర్తి స్థాయిలో పద్దును తీసుకు వచ్చింది. అయితే వేతన జీవులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న శ్లాబుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.

బడ్జెట్‌లో ట్యాక్స్ పేయర్స్‌కు గుడ్ న్యూస్.. భారీ ఊరట

2024-2025 ఆర్థిక సంవత్సరానికిగానూ కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. వరుసగా ఏడో సారి పద్దును ప్రవేశపెట్టి రికార్డును సృష్టించారు. ఎన్టీఏ ప్రభుత్వం రెండో సారి అధికారం చేపడుతున్న 2019 నుండి ఆమెనే ఆర్థిక శాఖమ మంత్రిగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ ఫిబ్రవరి 1న ఓటాన్ బడ్జెట్ అందించగా.. ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఓటాన్ బడ్జెట్ చెప్పుకోదగ్గ పథకాలు, ప్రోత్సహాకాలు లేకపోవడంతో మధ్యతరగతి వారిపై ఎలాంటి ప్రభావితం కనబర్చలేదు. సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలు, అలాగే ట్యాక్స్ పేయర్స్ కూడా ఈ బడ్జెట్ పై తమ ఆశలు పెట్టుకున్నారు.

తాజాగా బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం వేతన జీవులకు శుభవార్త చెప్పింది కేంద్రం. ట్యాక్స్ పేయర్స్‌కు పేయర్స్‌కు కొత్త ఆదాయపు పన్నులు స్లాబులను ప్రకటించింది. రూ.0 నుండి రూ. 3 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు. అలాగే రూ. 3 లక్షల నుండి 7 లక్షల వరకు 5 శాతం పన్ను విధించనున్నారు. రూ. 7-10 లక్షల వరకు 10 శాతం, రూ. 10-12లక్షల వరకు 15 శాతం, రూ. 12-15 లక్షల వరకు రూ. 20 శాతం పన్ను మినహాయింపునిచ్చింది. 15 లక్షలకు పై బడితే 30 శాతం వరకు పన్ను విధిస్తారు. దీంతో ఉద్యోగులు రూ. 17, 500 వరకు ఆదా చేసుకోవచ్చునని నిర్మల తెలిపారు. కొత్త పన్ను విధానంలో స్టాండర్ట్ డిడక్షన్  రూ. 50 వేల నుండి రూ. 75 వేలకు పెంచామని తెలిపారు. గతంలో ఉన్న శ్లాబులను అటు ఇటుగా కాస్తంత మార్పులు చేసింది.

గతంలో కొత్త ఆదాయపు పన్నుల శ్లాబులు ఇలా ఉండేవి. 0-3 లక్షలు ఎలాంటి పన్ను లేదు. అలాగే రూ. 3-6 లక్షల వరకు 5 శాతం, రూ. 6 నుండి-9 లక్షల వరకు 10 శాతం విధించారుు.  రూ. 9-12 లక్షల వరకు 20 శాతం, రూ. 12-15 లక్షల వరకు 20 శాతం, ఆపై రూ. 30 శాతం పన్ను విధించేది. కాగా, పాత పన్ను విధానం కొనసాగుతున్న అందులో ఎలాంటి మార్పులు లేవు. పాత పన్ను విధానాన్ని అనుసరిస్తున్న వేతన జీవులను కొత్త విధానం దిశగా ఉద్యోగులను నడిపించాలని కేంద్ర భావిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే లాంట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పై పన్ను పరిమితిని రూ. 2.5 లక్షలకు పెంచారు. ఈ కొత్త పన్ను విధానం వల్ల రూ. 3 లక్షల నుండి రూ. 10 లక్షల లోపు ట్యాక్స్ ప్లేయర్స్‌కు భారీ ఊరట కలగనుంది.