Dharani
Union Budget 2024 Highlights & Analysis in Telugu: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. మరి మొత్తం బడ్జెట్ ఎంత.. ఏ శాఖలకు ఎంత కేటాయించారు అంటే..
Union Budget 2024 Highlights & Analysis in Telugu: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. మరి మొత్తం బడ్జెట్ ఎంత.. ఏ శాఖలకు ఎంత కేటాయించారు అంటే..
Dharani
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్ సభలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీనిలో ఎక్కువగా మౌలిక వసతులపైనే దృష్టి సారించిన ఆర్థిక మంత్రి.. వ్యవసాయం, పేదలు, మహిళలు, యువత లక్ష్యంగా కీలక ప్రకటనలు చేశారు. మొత్తం రూ.47.65 లక్షల కోట్ల బడ్జెట్‌లో శాఖల వారీగా కేటాయింపులు చూస్తే రక్షణ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ.. రూ.6.2 లక్షల కోట్లు కేటాయించారు. ఆ తర్వాత ఉపరితల రవాణా, జాతీయ రహదారులకు ఎక్కువ భాగం కేటాయించారు.
ఫిబ్రవరి 1 గురువారం నాడు ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. సుమారు 57 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేశారు ఆర్థిక మంత్రి. గత 10 ఏళ్ల ఎన్డీయే సర్కారులో చేపట్టిన సంస్కరణలు, తీసుకొచ్చిన పథకాలు, వాటి పనితీరుపై తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పుకొచ్చారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అనంతరం 2024-25 ఏడాదికి సంబంధించిన బడ్జెట్ లెక్కలు వెల్లడించారు. మొత్తం బడ్జెట్‌లో వివిధ శాఖలు, పథకాలకు ఎంతెంత కేటాయించారనేది తెలిపారు. శాఖలవారీగా బడ్జెట్ కేటాయింపులు ఇలా ఉన్నాయి..
కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి 2024 – 2025 బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేటాయింపులు చేశారు.