Vinay Kola
Indian Railways: చాలా మంది షాప్ యజమానులు MRP కంటే ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తూ ఉంటారు. తాజాగా రైల్వే డిపార్ట్మెంట్ లో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది.
Indian Railways: చాలా మంది షాప్ యజమానులు MRP కంటే ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తూ ఉంటారు. తాజాగా రైల్వే డిపార్ట్మెంట్ లో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది.
Vinay Kola
మనం చాలా షాపుల్లో చూస్తూ ఉంటాం. చాలా మంది కూడా MRP ధర కంటే ఎక్కువ వసూలు చేస్తుంటారు. కానీ ఇలా వసూలు చేయడం చాలా నేరం. ఏ వస్తువుపై కూడా ఎంఆర్‌పీ ధర కంటే ఎక్కువ డిమాండ్ చేయకూడదు. కానీ వ్యాపారి MRP కన్నా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తే కన్జ్యూమర్ ఫోరమ్‌లో కేసు నమోదు చేయొచ్చు. అయినా కానీ చాలా మంది వ్యాపారస్తులు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా రైళ్లలో ఇలా ఎక్కువగా ధరలు వసూలు చేస్తుంటారు. తాజాగా ఇలాగే ఎక్కువ డబ్బులు వసూలు చేసిన ఓ క్యాటరింగ్ సంస్థపై ఇండియన్ రైల్వే ఏకంగా రూ. లక్ష జరిమానాని విధించింది. ప్రస్తుతం ఈ న్యూస్ దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది. ఇక దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
ఒక వ్యక్తి రీసెంట్ గా పూజా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాడు. ఆ సమయంలో అతను ఓ వాటర్ బాటిల్‌ను కొనుగోలు చేశాడు. క్యాటరింగ్ సర్వీస్ ద్వారా బాటిల్‌ను కొనేటప్పుడు సేల్స్ మ్యాన్ రూ. 20 డిమాండ్ చేశాడు. నిజానికి ఆ వాటర్ బాటిల్ అసలు ధర రూ. 15 అయితే రూ. 5 ఎక్కువ తీసుకున్నాడు. అయితే కస్టమర్ ఆ 5 రూపాయలు చెల్లించనని చెప్పగా ఆ సేల్స్ మ్యాన్ వాటర్ బాటిల్ ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. ఆ వాటర్ బాటిల్ ధర రూ. 20 అనే చెప్పుకొచ్చాడు. 20 రూపాయలు కడితేనే వాటర్ బాటిల్ ఇస్తా అని చెప్పాడు. అయితే సేల్స్‌మ్యాన్‌తో జరిగిన వాగ్వాదాన్ని అంతా కూడా ఆ ప్రయాణికుడు స్మార్ట్ ఫోన్‌లో రికార్డ్ చేశాడు. అంతటితో ఆగకుండా ఇండియన్ రైల్వే హెల్ప్‌లైన్ నెంబర్ అయిన 139కి కాల్ చేసి కంప్లైంట్ చేశాడు. అతను కంప్లయింట్ చేసిన కొద్ది సేపటికే క్యాటరింగ్ సర్వీస్ నుంచి ఒక ఏజెంట్ వచ్చాడు. ప్రయాణికుడి నుంచి ఎక్కువగా వసూలు చేసిన రూ.5 తిరిగి చెల్లిస్తానని చెప్పాడు. అయితే కోచ్‌లోని ఇతర ప్రయాణికుల నుంచి వసూలు చేసిన అదనపు డబ్బుని కూడా తిరిగి చెల్లించాలని ఆ ప్రయాణికుడు డిమాండ్ చేశాడు.
ఈ రకంగా ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరలు వసూలు చేస్తుండడంపై రైల్వేశాఖ సీరియస్ అయ్యింది. ఎక్కువ ధర వసూలు చేసిన ఆ సంస్థపై ఇండియన్ రైల్వే ఏకంగా రూ. లక్ష జరిమానా విధించినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ద్వారా అధికారికంగా తెలిపింది. ఆ వీడియోను షేర్ చేస్తూ.. ఇలాంటి ఘటనలపై ఇండియన్ రైల్వే కఠినంగా వ్యవహరిస్తుందని రైల్వే శాఖ తెలిపింది. ఇలాంటి చర్యలకి పాల్పడితే కచ్చితంగా 139 నెంబర్ కి కాల్ చేసి కంప్లయింట్ ఇవ్వాలని కోరింది. ఇలా ఒక్క రైల్వే స్టేషన్లలోని కాదు చాలా చోట్ల జరుగుతుంది. ఇలా ఎక్కడైనా MRP కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే కచ్చితంగా National Consumer Helpline నంబర్స్ 1800-11-4000 లేదా 1915 కి కాల్ చేయండి. కంప్లయింట్ చేయండి.
139 पर आई ओवरचार्जिंग की शिकायत, रेलवे ने लिया फटाफट एक्शन, कैटरिंग कंपनी पर लगा एक लाख का जुर्माना।
यात्रियों को ओवर चार्जिंग की राशि की गई रिटर्न! pic.twitter.com/8ZaomlEWml
— Ministry of Railways (@RailMinIndia) November 23, 2024