Budget 2024 Analysis: కేంద్రం గుడ్ న్యూస్.. సొంతింటి కలను నెరవేర్చేందుకు బడ్జెట్ లో కీలక ప్రకటన!

కేంద్రం గుడ్ న్యూస్.. సొంతింటి కలను నెరవేర్చేందుకు బడ్జెట్ లో కీలక ప్రకటన!

Union Budget 2024 Highlights & Analysis in Telugu: మధ్య తరగతి వారికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మళా సీతారామన్ గుడ్ న్యూస్ అందించారు. సొంతింటి కలను నెరవేర్చేందుకు కొత్త స్కీమ్ ను తీసుకురానున్నట్లు బడ్జెట్ లో ప్రకటించారు.

Union Budget 2024 Highlights & Analysis in Telugu: మధ్య తరగతి వారికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మళా సీతారామన్ గుడ్ న్యూస్ అందించారు. సొంతింటి కలను నెరవేర్చేందుకు కొత్త స్కీమ్ ను తీసుకురానున్నట్లు బడ్జెట్ లో ప్రకటించారు.

మరి కొన్ని నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఈరోజు మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. కేంద్ర కేబినెట్ ఆమోదంతో ఆర్థిక మంత్రి నిర్మళా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. అయితే ఎన్నికల అనంతరం పూర్తి స్థాయి బడ్జెట్ ను మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. ఇక ప్రస్తుతం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో కేంద్రం పేదలకు, మధ్య తరగతి వారికి ఊరటనిచ్చేలా పలు ప్రకటనలు చేసింది. ముఖ్యంగా మద్యతరగతికి చెందిన ప్రజలకు శుభవార్తను అందిస్తూ ఈ బడ్జెట్ లో కీలక ప్రకటన చేసింది. మిడిల్ క్లాస్ వర్గానికి చెందిన ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు కొత్త పథకం తీసుకురానున్నట్లు కేంద్రం ఈ బడ్జెట్ లో ప్రకటించింది.

ప్రతిఒక్కరికి కూడు,గూడు, గుడ్డ అనేవి ప్రాథమికావసరాలు. ఇప్పటికీ చాలా మందికి సొంత ఇళ్లు లేని వారు కోకోల్లలు. సొంత ఇంటి కలను నెరవేర్చుకునేందుకు నిరంతరం శ్రమించి పైసా పైసా కూడబెట్టుకుంటుంటారు. కానీ నేడు పెరిగిన ఖర్చులతో మధ్యతరగతి వారి సొంతింటి కల కలగానే మిగిలిపోతుంది. ఈ నేపథ్యంలో వారి కలను నెరవేర్చాలని కేంద్రం యోచిస్తోంది. సొంతింటి నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్ లో కీలక ప్రకటన చేసింది. నూతన గృహ నిర్మాణ విధానాన్ని తీసుకురానున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

పేదలు, కిరాయి ఇళ్లలో ఉండే వారి సొంతింటి కలను తీర్చేందుకు కొత్త హౌసింగ్ స్కీమ్ ను తీసుకురానున్నట్లు వెల్లడించింది మంత్రి. ఈ పథకం ద్వారా కొత్త ఇల్లు కట్టుకునేవారికి, లేదా కొనుగోలు చేసేవారికి సహాయం అందిస్తామని ఆర్థిక మంత్రి నిర్మళా సీతారామన్ తెలిపారు. కొత్త హౌసింగ్ స్కీమ్ ద్వారా మధ్యతరగతి వారికి భారీగా లబ్థి చేకూరనున్నట్లు తెలుస్తోంది. రానున్న ఐదేళ్లలో పీఎం ఆవాస్ యోజన కింద 2 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు నిర్మళా సీతారామన్ తెలిపారు.

Show comments