iDreamPost
android-app
ios-app

Aadhaar News: ఆగిపోనున్న ఆధార్ ఉచిత సేవలు.. ఎప్పటినుంచంటే?

  • Published Sep 05, 2024 | 3:00 AM Updated Updated Sep 05, 2024 | 3:00 AM

Aadhaar News: ప్రతి పౌరునికి కూడా ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ కార్డుని రెగ్యులర్ గా అప్డేట్ చేసుకోవడానికి UIDAI ఉచిత అప్డేట్ సర్వీసులని అందించింది. అయితే ఈ ఉచిత సేవలు ముగుస్తాయి.

Aadhaar News: ప్రతి పౌరునికి కూడా ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ కార్డుని రెగ్యులర్ గా అప్డేట్ చేసుకోవడానికి UIDAI ఉచిత అప్డేట్ సర్వీసులని అందించింది. అయితే ఈ ఉచిత సేవలు ముగుస్తాయి.

Aadhaar News: ఆగిపోనున్న ఆధార్ ఉచిత సేవలు.. ఎప్పటినుంచంటే?

దేశంలోని ప్రతి పౌరునికి కూడా ఆధార్ కార్డు అనేది తప్పనిసరి. దీనితోనే చాలా పనులు ముడిపడి ఉంటాయి. ముఖ్యంగా గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి పనికి కూడా ఆధార్ కార్డు తప్పనిసరిగా కావాలి. ఈ కార్డు లేకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఏ ప్రయోజనం కూడా పొందలేరు. కాబట్టి కచ్చితంగా ఆధార్ ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఆధార్ ని అప్డేట్ చేసుకోమని కేంద్రం ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటుంది. ఆధార్ కార్డుని రెగ్యులర్ గా అప్డేట్ చేసుకోవడానికి UIDAI ఉచిత అప్డేట్ సర్వీసులని అందించింది. అయితే ఈ ఉచిత సేవలు సెప్టెంబర్ 14వ తేదీన ముగుస్తాయి.

గడువు ముగిసిన తర్వాత ఆధార్ అప్డేట్ చేసుకుంటే మాత్రం 50 రూపాయల రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 10 రోజుల్లో అప్డేట్ చేసుకుంటే ఎటువంటి అదనపు ఫీజు ఉండదు. ఆధార్ కార్డ్ కలిగిన ప్రతి ఒక్కరు కూడా కచ్చితంగా 10 సంవత్సరాల తరువాత అప్డేట్ చేసుకోవాలని UIDAI సూచించింది. అందుకు అనుగుణంగా ఆధార్ అప్డేట్ కోసం గతంలో రూ. 50 రూపాయల ఛార్జ్ ను విధించేది. తరువాత దానిని ఎత్తి వేసి ఉచిత అప్డేట్ సర్వీస్ ను అందించింది. అయితే, ఈ ఉచిత ఆధార్ అప్డేట్ సర్వీస్ కి మాత్రం గడువు పెట్టింది. ఇక ఆ గడువు ఇప్పుడు రాబోయే సెప్టెంబర్ 14వ తేదీ తో ముగుస్తుంది. ఒకవేళ మీరు మీ ఆధార్ అప్డేట్ ను ఫ్రీగా చేసుకోవాలనుకుంటే ఈ 10 రోజుల లోపే చేసుకోండి. లేదంటే తర్వాత కచ్చితంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఆధార్ అప్డేట్ ను ఆన్లైన్ లో సింపుల్ గా చేసుకోవచ్చు. ముందుగా మీరు myaadhaar.uidai.gov.in/document-update సైట్ ని సందర్సించాలి. ఇక ఆ తర్వాత ఆధార్ నెంబర్ తో లాగిన్ అవ్వాలి. ఆధార్ నెంబర్ నమోదు చేసాక రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి OTP వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా లాగిన్ కావాలి. ఇక మీరు లాగిన్ అయిన తర్వాత మీ అడ్రస్, ఇతర వివరాలు సరిగ్గా ఉన్నాయో లేవో కచ్చితంగా చెక్ చేసుకోవాలి. అందులో మీ లేటెస్ట్ అడ్రస్ ను నమోదు చేస్తున్నప్పుడు దానికి తగిన డాక్యుమెంట్ ని అప్లోడ్ చెయ్యాలి. ఇక అలా చేసిన తర్వాత వివరాలు మరోసారి చెక్ చేసుకుని సబ్మీట్ చేయాలి. తరువాత UIDAI మీ వివరాలు పరిశీలించి అప్డేట్ చేస్తుంది.