ప్రపంచ వ్యాప్తంగా వాహన రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ రంగంలో వస్తున్న తాజా ఆవిష్కరణలు వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కాగా.. ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. దాంతో ప్రముఖ కంపెనీలు అన్ని వీటి తయారీపై ఇప్పటికే దృష్టిపెట్టాయి. తాజాగా భారతదేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ అయిన టీవీఎస్.. ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఇది ఒక ఫ్యూచరిస్టిక్ ఈవీగా చెప్పుకొచ్చింది. అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఈ స్కూటర్ గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
TVS.. ఇండియాలో బైక్స్ తయ్యారు చేసే ప్రముఖ కంపెనీలలో ఒకటి. తాజాగా ఫూచరిస్టిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఆవిష్కరించింది. ఈ న్యూ టీవీఎస్ ఎక్స్ స్కూటర్ ను 4.4 KWH బ్యాటరీ ప్యాక్, 11 KWPMSM మోటార్ ఎక్విప్ చేసింది. కాగా ఇది 140 కిలోమీటర్ల రేంజ్ ను అందించగలదు. ఇక ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 105 కిలోమీటర్లుగా ఉండగా.. కేవలం 2.6 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. దీనికి ఉన్న మరో స్పెషాలిటీ ఏంటంటే? గంటలోనే 50 శాతం ఛార్జింగ్ ఎక్కుతుంది.
టీవీఎస్ కంపెనీ తన న్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ ను సరికొత్త డిజైన్ తో లాంచ్ చేసింది. ఈ ప్లాట్ ఫారమ్ లో 10.2 ఇంచుల టచ్ స్క్రీన్ ను అందించారు. దీనిలో వీడియోలు చూడటం, సెట్టింగ్ థీమ్ లు, డిజిటల్ కీలు, జియో ఫెన్సింగ్, వీడియో గేమ్ లు లాంటి నావిగేషన్ ఫీచర్లు ఉన్నాయి. అలాగే థెప్ట్ అలర్ట్, స్మార్ట్ హోల్డ్, క్రూయిజ్ కంట్రోల్, ఏబీఎస్ ఉన్నాయి. కాగా.. కొత్తగా వచ్చిన ఈ హై ఫర్ఫామెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఓలా ఎస్ 1 ప్రో, ఏథర్ 450ఎక్స్ లాంటి ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీ పడనుంది. ఇన్ని అద్భుతమైన ఫీచర్లు కలిగిన టీవీఎస్ ఎక్స్ ధర కూడా అదే రేంజ్ లో ఉంది. దీని ధరను మనదేశంలో రూ. 2,49,900గా(ఎక్స్ షోరూం) నిర్ణయించారు. అయితే కేవలం రూ. 5 వేలు మాత్రమే చెల్లించి ఈ ఈవీని బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇండియాలో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ బైక్ గా టీవీఎస్ ఎక్స్ నిలువనుంది. మరి మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఉండే ఇండియా లాంటి దేశంలో ఇంత భారీ ధరకు ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనుగోలు చేస్తారా? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు మార్కెట్ నిపుణులు.
India is At The Top, whether it’s leaving footprints on the moon or creating new pathways down here 🇮🇳
.
.
.
.#TVSX #Chandrayan3 pic.twitter.com/Hu2qn0IlwB— TVS X (@TVSXofficial) August 24, 2023
ఇదికూడా చదవండి: పొలిటికల్ ఎంట్రీపై రాహుల్ సిప్లిగంజ్ క్లారిటీ! పోస్ట్ వైరల్..