iDreamPost
android-app
ios-app

మార్కెట్ లోకి న్యూ TVS అపాచీ.. ఈసారి బడ్జెట్ ధరలోనే

బైక్ ప్రియులకు అదిరిపోయే బైక్ మార్కెట్ లోకి విడుదలైంది. దిగ్గజ టూవీలర్ తయారీ సంస్థ టీవీఎస్ తాజాగా టీవీఎస్ అపాచీ 160 ఆర్టీఆర్ బ్లాక్ డార్క్ ఎడిషన్‌ను శుక్రవారం మార్కెట్లో విడుదల చేసింది.

బైక్ ప్రియులకు అదిరిపోయే బైక్ మార్కెట్ లోకి విడుదలైంది. దిగ్గజ టూవీలర్ తయారీ సంస్థ టీవీఎస్ తాజాగా టీవీఎస్ అపాచీ 160 ఆర్టీఆర్ బ్లాక్ డార్క్ ఎడిషన్‌ను శుక్రవారం మార్కెట్లో విడుదల చేసింది.

మార్కెట్ లోకి న్యూ TVS అపాచీ.. ఈసారి బడ్జెట్ ధరలోనే

ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలు సరికొత్త మోడళ్లను ఆవిష్కరిస్తున్నాయి. ఆధునిక టెక్నాలజీతో యూత్ ను ఆకట్టుకునే డిజైన్ లో బైక్ లను రూపొందిస్తూ మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. బైక్ లవర్స్ కు మరో అద్భుతమైన బైక్ అందుబాటులోకి వచ్చింది. బైక్ రైడింగ్ అంటే ఇష్టపడే వారికి స్పోర్టీ లుక్ లో ఓ బైక్ విడుదలైంది. దిగ్గజ టూవీలర్ తయారీ సంస్థ టీవీఎస్ తాజాగా టీవీఎస్ అపాచీ 160 ఆర్టీఆర్ బ్లాక్ డార్క్ ఎడిషన్‌ను శుక్రవారం మార్కెట్లో విడుదల చేసింది. స్టైలిష్ లుక్ లో ఉన్న ఈ బైక్ వాహన ప్రియులను ఆకట్టుకుంటోంది. ఈ బైక్ ధర కూడా బడ్జెట్ ధరలోనే ఉంది. అదిరిపోయే ఫీచర్లు కూడా అందించారు.

టీవీఎస్ కంపెనీ విడుదల చేసిన టీవీఎస్ అపాచీ 160 ఆర్టీఆర్ బైక్ ధర రూ.1,09,990 (ఎక్స్ షోరూమ్), టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4-వాల్వ్ బైక్ రూ.1,19,990 (ఎక్స్ షోరూమ్) గా కంపెనీ నిర్ణయించింది. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 బైక్ బోల్డర్, స్పోర్టియర్ లుక్‌తో వస్తోందని సంస్థ బిజినెస్ ప్రీమియం హెడ్ విమల్ సంబ్లీ చెప్పారు. ఈ బైక్ శక్తివంతమైన 160 సిసి ఇంజన్‌ని కలిగి ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 17.6 పీఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 3 రైడ్ మోడ్‌లు, డిజిటల్ ఎల్సీడీ క్లస్టర్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు మరియు టెయిల్‌ల్యాంప్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇందులో స్పోర్ట్, అర్బన్ మరియు రెయిన్ మోడ్ ఉన్నాయి. బ్లాక్ ఫినిష్‌తో వస్తున్న మోటారు సైకిల్ మినిమల్ గ్రాఫిక్స్ డిజైన్, ట్యాంకుపై బ్లాక్ టీవీఎస్ లోగో, బ్లాక్డ్ ఔట్ ఎగ్జాస్ట్ పైప్ తదితర ఫీచర్లతో వస్తున్నది. మీరు ఈ రెండు బైక్‌లలో 5 స్పీడ్ గేర్‌బాక్స్ అందించారు. టీవీఎస్ అపాచీ 160 ఆర్టీఆర్ 159.7 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ టూ-వాల్వ్ ఇంజన్‌ని కలిగి ఉంది, ఇది ఫ్యూయల్ ఇంజెక్షన్‌తో వస్తుంది. ఈ బైక్ యొక్క ఇంజన్ 15.8బీహెచ్పీ పవర్ మరియు 13.85ఎన్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.