TVS Apache RTR 160 Racing Edition: బైక్ లవర్స్ కు పండగే.. క్రేజీ ఫీచర్లతో TVS నుంచి మరో బైక్.. ధర ఎంతంటే?

బైక్ లవర్స్ కు పండగే.. క్రేజీ ఫీచర్లతో TVS నుంచి మరో బైక్.. ధర ఎంతంటే?

TVS Apache RTR 160 Racing Edition: బైక్ లవర్స్ కు గుడ్ న్యూస్. మార్కెట్ లోకి మరో కొత్త బైక్ వచ్చేసింది. టీవీఎస్ కంపెనీ 2024 టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 రేసింగ్ ఎడిషన్ మోటారు సైకిల్ ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.

TVS Apache RTR 160 Racing Edition: బైక్ లవర్స్ కు గుడ్ న్యూస్. మార్కెట్ లోకి మరో కొత్త బైక్ వచ్చేసింది. టీవీఎస్ కంపెనీ 2024 టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 రేసింగ్ ఎడిషన్ మోటారు సైకిల్ ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.

ఆటోమొబైల్ రంగంలో సరికొత్త బైక్స్ పుట్టుకొస్తున్నాయి. లేటెస్ట్ టెక్నాలజీతో టూవీలర్ తయారీ సంస్థలు సరికొత్త బైక్ లను రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. స్టన్నింగ్ డిజైన్, క్రేజీ ఫీచర్లతో టూవీలర్స్ ను తయారు చేస్తూ రిలీజ్ చేస్తున్నాయి. యూత్ ను దృష్టిలో పెట్టుకుని బైక్ తయారీ కంపెనీలు న్యూ మోడల్స్ ను ప్రవేశపెడుతున్నాయి. ఈ క్రమంలో బైక్ లవర్స్ కు మరో న్యూ బైక్ అందుబాటులోకి వచ్చింది. టీవీఎస్ కంపెనీ సూపర్ ఫీచర్స్ తో అపాచీ ఆర్టీఆర్ 160 రేసింగ్ ఎడిషన్ ను తీసుకొచ్చింది. ఈ బైక్ యూత్ ను తెగ అట్రాక్ట్ చేస్తోంది. ఈ బైక్ ధర ఎంతంటే?

టీవీఎస్ నుంచి విడుదలైన అపాచీ బైక్ లకు మార్కెట్ లో ఫుల్ క్రేజ్ ఉంటుంది. యూత్ ఈ బైక్ లను ఎక్కువగా లైక్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే టీవీఎస్ కంపెనీ 2024 టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 రేసింగ్ ఎడిషన్ బైక్ ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.1,28,720 (ఎక్స్ షోరూమ్) గా కంపెనీ నిర్ణయించింది. ఇప్పటికే మార్కెట్ లో దుమ్ము రేపుతున్న బజాజ్ పల్సర్ ఎన్ 160, హీరో ఎక్స్ ట్రీమ్ 160ఆర్ బైక్స్ కు టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 రేసింగ్ ఎడిషన్ బైక్ హెవీ కాంపిటీషన్ ఇవ్వనున్నది.

టీవీఎస్ 2024 అపాచీ ఆర్టీఆర్ 160 రేసింగ్ ఎడిషన్ బైక్ 159.7సీసీ, ఎయిర్ కూల్డ్, ఎఫ్ఐ ఇంజిన్ కలిగి ఉంటుంది. గరిష్టంగా 16.04 పీఎస్ విద్యుత్, 13.85 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్ బాక్స్ తో వస్తుంది. డబుల్ క్రెడిట్ సింక్రనైజ్డ్ స్టిఫ్ చేసిస్ ఆధారంగా రూపుదిద్దుకున్న 2024 టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 రేసింగ్ ఎడిషన్ ముందు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక 5-స్టెప్ అడ్జస్టబుల్ షాక్స్ కలిగి ఉంటుంది. 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ విత్ ట్యూబ్ లెస్ టైర్స్ కలిగి ఉంటది. డిజిటల్ ఎల్సీడీ క్లస్టర్ విత్ టీవీఎస్ స్మార్ట్ కనెక్ట్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, టెయిల్ లాంప్, గ్లైడ్ థ్రూ టెక్నాలజీ తదితర ఫీచర్లు ఉన్నాయి. టీవీఎస్ స్మార్ట్ కనెక్ట్ టెక్నాలజీతో బ్లూటూత్ విత్ వాయిస్ అసిస్ట్, టర్న్ బై టర్న్ నేవిగేషన్, కాల్ లేదా ఎస్ఎంఎస్ నోటిఫికేషన్లు పొందొచ్చు.

Show comments