సామాన్యులకు ఊరట.. భారీగా దిగి వస్తోన్న టమాటా ధర

ఈ ఏడాది టమాటా పండించిన రైతుల పంట పండింది. నెల, రెండు నెలల వ్యధిలోనే టమాటా రైతులు లక్షాధికారులు, కోటీశ్వరులు అయ్యారు. టమాటా ధర కిలో 250 రూపాయల వరకు పెరిగింది. ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పారు.  కిలో 300 రూపాయల వరకు పెరుగుతుందని మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక పెరుగుతున్న ధరలకు భయపడి చాలా మంది టమాటా కొనడం తగ్గించారు. కొందరు చాలా తక్కువ మొత్తంలో వినియోగిస్తున్నారు. టమాటాను చూస్తేనే భయపడే తరుణంలో.. అనూహ్యంగా ఆదివారం టమాటా ధర దిగి వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా కిలో టమాటా ధర 60 రూపాయలు పలికింది. పైగా మరి కొన్ని రోజుల్లో టమాటా ధర భారీగా దిగి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం చాలా ప్రాంతాల్లో టమాటా ధర దిగి వచ్చింది. ఆ వివరాలు..

ఆదివారం హైదరాబాద్‌ మార్కెట్‌లో టమాటా ధర భారీగా దిగి వచ్చింది. కిలో టమాటా 120-160 రూపాయలకు పడి పోయింది. కొన్ని మార్కెట్స్‌లో టమాటా ధర కిలోకు 100 రూపాయలు, అంతకన్నా తక్కువకు పడిపోయింది. వారం రోజుల క్రితం వరకు కిలో టమాటా ధర 180-200 రూపాయల వరకు పలికింది. త్వరలోనే టమాటా ధర భారీగా దిగి వచ్చే అవకాశం ఉందంటున్నారు. కోతలు ఊపందుకోవడం, పంటను త్వరగా అమ్ముకునేందుకు రైతులు పోటీ పడుతుండటంతో ధరలు దిగి రావడానికి కారణం అంటున్నారు.

ఇక ఆదివారం అనంతపురం కక్కలపల్లి మార్కెట్‌లో టమాటా ధర భారీగా దిగి వచ్చింది. కిలో మొదటి రకం ధర రూ.110 పలకగా.. రెండో రకం ధర రూ.90.. మూడో రకం రూ.75 చొప్పున పలికాయి. మొదటి రకం టమాటా 15 కిలోల బుట్ట ధర రూ.1,650, రెండో రకం రూ.1,350, మూడో రకం రూ.1,125 చొప్పున ధర పలికింది. ఆదివారం మార్కెట్‌కు మొత్తం 750 టన్నులు వచ్చాయి. మరోవైపు అన్నమయ్య జిల్లా ములకలచెరువు వ్యవసాయ మార్కెట్‌లో కూడా గత రెండు రోజులుగా టమోటా ధరలు తగ్గుతూ వస్తున్నాయి.

ఇక ఈ ఏడాది టమాటా అమ్మి.. చాలా మంది కోటీశ్వరులు, లక్షాధికారులు అయిన సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే టమాటా ధర సామాన్యులకు అందుబాటులోకి వస్తుంది అని భావిస్తున్నారు. ఇక ఈ ఏడాది టమాటా అమ్మి.. చాలా మంది కోటీశ్వరులు, లక్షాధికారులు అయిన సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే టమాటా ధర సామాన్యులకు అందుబాటులోకి వస్తుంది అని భావిస్తున్నారు.

Show comments