P Venkatesh
భారీగా పెరిగిన బంగారం ధరలు వినియోగదారులకు షాకిస్తున్నాయి. తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పసిడి ధరలు పెరిగాయి. గోల్డ్ దారిలోనే వెండి కూడా పయనిస్తోంది. దీంతో వినియోగదారులు షాకు కు గురవుతున్నారు.
భారీగా పెరిగిన బంగారం ధరలు వినియోగదారులకు షాకిస్తున్నాయి. తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పసిడి ధరలు పెరిగాయి. గోల్డ్ దారిలోనే వెండి కూడా పయనిస్తోంది. దీంతో వినియోగదారులు షాకు కు గురవుతున్నారు.
P Venkatesh
బంగారం కొనాలనుకునే వారికి బిగ్ షాక్. గత కొద్ది రోజులుగా స్థిరంగా కొనసాగిన గోల్డ్ ధరలు రికార్డ్ స్థాయిలో పెరిగాయి. పుత్తడి ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ షాక్ ఇస్తున్నాయి. దేశ వ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతోంది. శుభకార్యాల నేపథ్యంలో పసిడి కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. గోల్డ్ రేట్ పైపైకి ఎగబాకుతున్న డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. అంతర్జాతీయ మార్కెట్ లో చోటుచేసుకున్న ఒడిదుడుకులు, డాలర్ తో రూపాయి మారకం విలువ పడిపోవడం వంటి కారణాలతో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. నేడు బంగారం ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. తులం పసిడి పై ఏకంగా రూ. 300 పెరిగింది.
దేశీయ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ 300 పెరిగి రూ 57,100కు చేరుకుంది. ఇదే క్రమంలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ 320 పెరిగి రూ. 62, 290 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో బంగారం ధరలు ఇదే విధంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని హస్తినలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,250 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 62,440 కి చేరింది. ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 57,100 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,290 వద్ద అమ్ముడవుతోంది.
బంగారం బాటలోనే వెండి పయనిస్తోంది. నేడు వెండి ధరలో కూడా భారీ మార్పు చోటుచేసుకుంది. ఏకంగా కిలో వెండిపై రూ. వెయ్యి పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 80,200వద్ద ట్రేడ్ అవుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 80,200. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాలలో కిలో వెండి రూ.77,200 కు అమ్ముడవుతోంది.