iDreamPost
android-app
ios-app

రికార్డు దిశగా దూసుకెళ్తున్న పసిడి ధర.. ఈ రోజు ఎంతంటే?

  • Published Mar 06, 2024 | 7:46 AM Updated Updated Mar 06, 2024 | 7:46 AM

Golda and Silver Rates: నిన్న మొన్నటి వరకు పసిడి, వెండి ధరలు కాస్త పరవాలేదు అనిపించినా.. నేటి ధరలు చుక్కలు చూపించాయి. బంగారం ధరలు భారీగా పెరగడంతో కొనుగోలుదారులు మళ్లీ ఆలోచనలో పడ్డారు.

Golda and Silver Rates: నిన్న మొన్నటి వరకు పసిడి, వెండి ధరలు కాస్త పరవాలేదు అనిపించినా.. నేటి ధరలు చుక్కలు చూపించాయి. బంగారం ధరలు భారీగా పెరగడంతో కొనుగోలుదారులు మళ్లీ ఆలోచనలో పడ్డారు.

రికార్డు దిశగా దూసుకెళ్తున్న పసిడి ధర.. ఈ రోజు ఎంతంటే?

దేశంలో మొన్నటి వరకు పసిడి ధరలు పరవాలేదు అనిపించినా.. ఈ నెల మళ్లీ చుక్కలు చూపిస్తుంది. నేడు బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. మొదటి సారిగా తులం బంగారం రూ.65 వేలకు పెరిగింది. గత ఏడాది పసిడి ధర ఈ సమయానికి రూ.60 వేలు దాటింది. అంతర్జాతీయ మార్కెట్ లో పరిణామాల కారణంగా పసిడి, వెండి ధరలు పెరగడం, తగ్గడం లాంటిది జరుగుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. గత నెల బంగారం ధరలు చాలా వరకు తగ్గడంతో కొనుగోలుగారులు సంతోషంలో ఉన్నారు.. ఆ సంతోషం కొద్దిరోజులు కూడా లేకుండా పోయింది. నేడు దేశీయ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. వివరాల్లోకి వెళితే..

పసిడి మళ్లీ పరుగులు పెడుతుంది.. నిన్నటి కంటే నేటి ధర భారీగా పెరిగింది. మంగళవారం బులియన్ మార్కెట్ లో పసిడి ధర ఒక్కసారే రూ.800 పెరిగి తులం బంగారం రూ.65 వేలకు చేరుకుంది. గత ట్రేడింగ్ సెషన్ ల పసిడి ధర రూ.64,200 వరకు కొనసాగింది. ఇక వెండి ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. రాబోయే పెళ్లిళ్ల సీజన్ కి బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ లో నేటి గోల్డ్ రేటు ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,460 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,860 వద్ద కొనసాగుతుంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.78,200 వద్ద కొనసాగుతుంది.

ప్రధాన నగరాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 59,610 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.65,010 వద్ద కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై, బెంగుళూరు, కోల్‌కొతా, కేరళాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.59,460 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.64,860 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.60,160 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.65,630 వద్ద కొనసాగుతుంది.  బెంగుళూరు లో కిలో వెండి ధర రూ.72,250, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి ధర రూ.74,700వద్ద ట్రెండ్ అవుతుంది. చెన్నై కిలో వెండి ధర రూ. 78,200 లు ఉండగా, ఢిల్లీ లో రూ.74,700 వద్ద ట్రెండ్ అవుతుంది.