iDreamPost
android-app
ios-app

పసిడి ప్రియులకు అదిరే శుభవార్త.. వరుసగా దిగివస్తున్న బంగారం ధర..

  • Published May 15, 2024 | 8:43 AM Updated Updated May 15, 2024 | 8:43 AM

ఇటీవల కాలంలో వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలపై తాజాగా పసిడి ప్రియులకు అదిరే శుభవార్త వచ్చింది. వరుసగా మూడో రోజూ బంగారం ధరలు పడిపోయాయి. ఆ వివరాలెంటో తెలుసుకుందాం.

ఇటీవల కాలంలో వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలపై తాజాగా పసిడి ప్రియులకు అదిరే శుభవార్త వచ్చింది. వరుసగా మూడో రోజూ బంగారం ధరలు పడిపోయాయి. ఆ వివరాలెంటో తెలుసుకుందాం.

  • Published May 15, 2024 | 8:43 AMUpdated May 15, 2024 | 8:43 AM
పసిడి ప్రియులకు అదిరే శుభవార్త.. వరుసగా దిగివస్తున్న బంగారం ధర..

ఇటీవల కాలంలో పసిడి, వెండి ధరలు ఎప్పుడు పెరుగుతున్నాయో.. ఎప్పుడు తగ్గుతున్నయో బంగారం కోనుగోలుదారులకు అస్సలు అర్థం కావడం లేదు. ముఖ్యంగా ఈ ఏడాదది జనవరి, ఫిబ్రవరి నెలలో తగ్గిన బంగారం ధరలు.. మార్చి, ఏప్రిల్‌ నెలలకు వచ్చే సరికి కొండెక్కి కూర్చున్న సంగతి తెలిసిందే. అసలే శుభకార్యలు, పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో.. మార్కెట్‌ లో బంగారం ధర, డిమాండ్‌ బాగా పెరిగిపోయింది. అయితే అందుకు కారణం అంతర్జాతీయ మార్కెట్‌ లో ఏర్పడుతున్న కీలక పరిణామాలు కారణంగా.. పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలపై తాజాగా పసిడి ప్రియులకు అదిరే శుభవార్త వచ్చింది. వరుసగా మూడో రోజూ బంగారం ధరలు పడిపోయాయి. ఆ వివరాలెంటో తెలుసుకుందాం.

తాజాగా బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇదే మంచి అవకాశం. ఎందుకంటే.. వరుసగా మూడో రోజు బంగారం ధరలు పడిపోయాయి.  అయితే ఈ విషయంలో పసిడి ప్రియులకు కాస్త ఊరట లభించింది అని చెప్పవచ్చు. అయితే, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు దిగివస్తుండడమే దేశీయంగా ధరలు పడిపోయేందుకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే దేశీయంగా ప్రస్తుతం శుభముహూర్తాలు లేవు. పెళ్లిళ్ల సీజన్ కాకపోవడంతో బంగారానికి డిమాండ్ తగ్గినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణాలతోనే గోల్డ్ రేట్ల పతనానికి కారణంగా భావిస్తున్నామంటున్నారు.ఈ క్రమంలోనే.. దేశీయ మార్కెట్లో మే 15వ తేదీన బంగారం, వెండి రేట్లు ఇవాళ ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Again the gold rate fell

అంతర్జాతీయ మార్కెట్లో చూసుకుంటే.. బంగారం ధరలు కాస్త దిగివచ్చాయి. కాగా, ప్రస్తుతం స్పాట్‌ గోల్డ్‌ రేటు ఔన్సుకు 2356 డాలర్ల వద్ద ఉంది. అలాగే స్పాట్ సిల్వర్ రేటు 28.50 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు రూపాయి మారకం విలువ మళ్లీ పడిపోయింది. డాలర్ తో పోలిస్తే ప్రస్తుతం రూ.83.503 వద్ద ట్రేడింగ్ అవుతోంది.  అయితే, హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మూడు రోజులుగా పడిపోతూ వస్తున్నాయి. ఇక ఇవాళ  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.400 మేర తగ్గి రూ. 66,750 వద్దకు దిగివచ్చింది. గత మూడు రోజుల్లో చూసుకుంటే రూ.800 మేర పడిపోయింది. అదే 24 క్యారెట్ల బంగారం చూసుకుంటే ఇవాళ 10 గ్రాములకు రూ. 430 తగ్గింది. దీంతో తులం రేటు రూ. 72,820కి దిగివచ్చింది.

కాగా, మూడు రోజుల్లో మొత్తంగా రూ. 870 మేర దిగివచ్చింది. ఇక ఢిల్లీ మార్కెట్లో చూస్తే 22 క్యారెట్ల బంగారం రేటు రూ.400 పడిపోయి రూ.66 వేల 750 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.430 పడిపోయి రూ. 72 వేల 820 వద్దకు దిగివచ్చింది. అయితే గత మూడు రోజుల పాటు దిగివచ్చిన వెండి మాత్రం ఇవాళ పెరగడం గమనార్హం. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ.700 మేర పెరిగి రూ. 87 వేల 200 వద్దకు ఎగబాకింది. మరి, బంగారం ధరలు మరో మూడురోజుల వరకు భారీగా దిగి రావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.