మహిళలను ఊరిస్తున్న బంగారం ధరలు.. ఈరోజు ధర ఎంతంటే?

Today Gold Price In Hyderabad And Vijayawada: బంగారం కొనాలి అని అనుకుంటున్న వారికి ఇది కాస్త శుభవార్త అనే చెప్పాలి. ప్రస్తుతం బంగారం ధరలు కొనుగోలుదారుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మీరు గనుక బంగారం కొనాలి అనుకుంటో ఈరోజు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Today Gold Price In Hyderabad And Vijayawada: బంగారం కొనాలి అని అనుకుంటున్న వారికి ఇది కాస్త శుభవార్త అనే చెప్పాలి. ప్రస్తుతం బంగారం ధరలు కొనుగోలుదారుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మీరు గనుక బంగారం కొనాలి అనుకుంటో ఈరోజు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

బంగారం అంటే ఇష్టపడని మహిళలు, యువతులు ఉండరేమో. అందుకే ప్రపంచ దేశాల్లో ఇండియాలోనే ఎక్కువ డిమాండ్ కనిపిస్తూ ఉంటుంది. ఎలాంటి సందర్భం అయినా కూడా కచ్చితంగా బంగారం కొనాసి అనుకుంటారు. అయితే గత కొన్నిరోజులుగా బంగారం ధరల్లో స్థిరత్వం లేదు. మొన్నటి వరకు తులం బంగారం మీద రూ.5 వేల వరకు తగ్గింపు కనిపించినా కూడా తర్వాత.. క్రమంగా పెరుగుదల కనిపించింది. కానీ, ఇవాళ మాత్రం బంగారం ధరలో స్థిరత్వం కనిపిస్తోంది. నిన్న కూడా బంగారం ధర పెరిగింది.. కానీ, ఇవాళ మాత్రం ధరలో ఎలాంటి పెరుగుదల కనిపించలేదు. అందుకే బంగారం కొనాలి అనుకునే వారికి ఇది శుభవార్త అని చెబుతున్నారు.

కేంద్రం కొత్త బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. కానీ, మళ్లీ ధరల్లో పెరుగుదల కనిపించింది. వరుసగా మూడ్రోజులు బంగారం ధరలు పెరుగుతూ వచ్చాయి. నిన్న కొంచం ధరలు తగ్గగా.. ఇవాళ మళ్లీ స్థిరంగా కనిపించింది. అంటే రేపటి ధరలు పెరిగినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందుకే బంగారం కొనాలి అనుకునే వాళ్లు త్వరపడాలి అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఆదివారం బులియన్ మార్కెట్లో 22 క్యారెట్స్ బంగారం 10 గ్రాముల ధర రూ.64,700గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.70,580గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలను చూస్తే.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,850గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.70,730గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. విజయవాడ, విశాఖ, హైదరాబాద్ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,700గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.70,580గా ఉంది. ముంబయిలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇంక వెండి విషయానికి వస్తే.. ప్రస్తుతానికి కాస్త ధరలో తగ్గుదల కనిపిస్తోంది. కానీ, భవిష్యత్ లో వెండి ధర పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వెండి కిలో రూ.90,900గా కొనసాగుతోంది. బులియన్ మార్కెట్, ఢిల్లీ, ముంబయిలో వెండి ధర కిలోకి రూ.85,500గా ఉంది. బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పుడే కొనుగోలు చేస్తే మంచిది అంటూ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

Show comments