iDreamPost
android-app
ios-app

బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త.. నేడు ఎంత తగ్గిందంటే!

  • Published Jul 11, 2023 | 7:47 AMUpdated Jul 11, 2023 | 7:52 AM
  • Published Jul 11, 2023 | 7:47 AMUpdated Jul 11, 2023 | 7:52 AM
బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త.. నేడు ఎంత తగ్గిందంటే!

భారతీయులకు బంగారంతో విడదీయరాని అనుబంధం ఉంది. ఎంత డబ్బు ఉన్నా సరే.. ఒంటి నిండుగా ఆభరణాలు ఉంటే అప్పుడే మగువల మనసు సంతోషపడుతుంది. మన దగ్గర బంగారానికి డిమాండ్‌ ఎక్కువ. కానీ అందుకు సరిపడ బంగారం మన దగ్గర లభించదు. దాంతో విదేశాల నుంచి బంగారాన్ని భారీగా దిగుమతి చేసుకుంటున్నాం. దాంతో పసడి రేటు చుక్కలను తాకుతుంది. ఇక వివాహాది శుభకార్యల వేళ బంగారానికి డిమాండ్‌ మరి కాస్త ఎక్కువ ఉండటంతో.. ధరలు విపరీతంగా పెరుగుతాయి. ఈ ఏడాది ఇదే పరిస్థితి కనిపించింది. ఇప్పటికే బంగారం ధర ఆల్‌ టైం గరిష్టానికి చేరుకుంది. అయితే గత కొన్ని రోజులుగా బంగారం ధర దిగి వస్తోంది. ఇక జూలై నెల ప్రారంభం నుంచి పసిడి రేటు పడిపోతూనే ఉంది. ఇక నిన్నటి సెషన్‌లో స్థిరంగా ఉన్న పుత్తడి ధర నేడు తగ్గింది. మరి మంగళవారం నాడు పసిడి ధర ఎంత దిగి వచ్చింది.. నేడు దేశంలోని ముఖ్య నగరాల్లో పసిడి ధర ఎలా ఉంది అంటే…

నేడు రాజధాని హైదరాబాద్‌లో బంగారం ధర దిగి వచ్చింది. ఆభరణాల తయారీకి ఉపయోగించి గోల్డ్‌ 10 గ్రాముల ధర 100 రూపాయలు తగ్గింది. దాంతో నేడు హైదరాబాద్‌ మార్కెట్‌లో 22 క్యారెట్‌ బంగారం 10 గ్రాముల ధర 54, 450 రూపాయలుగా ఉంది. అలానే మేలిమి బంగారం 24 క్యారెట్‌ గోల్డ్‌ రేటు 10 గ్రాముల మీద రూ. 100 తగ్గి 59, 410 రూపాయలుగా ట్రేడ్‌ అవుతోంది. ఇక దేశ రాజధాని హస్తినలో సైతం బంగారం ధర పడిపోయింది. నేడు ఢిల్లీలో 22 క్యారెట్‌ పసిడి ధర 10 గ్రాముల మీద 100 రూపాయలు తగ్గి 54, 600 రూపాయలు ఉండగా.. 24 క్యారెట్‌ బంగారం 10 గ్రాముల ధర 100 రూపాయలు పడి పోయి 59, 560 రూపాయలుగా ట్రేడ్‌ అవుతోంది.

ఇక బంగారం ధరలు స్వల్పంగా తగ్గితే.. వెండి ధర మాత్రం పెరిగింది. నేడు హైదరాబాద్‌లో కిలో రేటు రూ. 100 పెరిగి 76,800 రూపాయలుగా ఉంది. అలానే ఢిల్లీలో కిలో వెండి రేటు మీద రూ. 100 తగ్గి 73,400 రూపాయలుగా ఉంది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో చూసుకుంటే నేడు స్పాట్ బంగారం ధర 1928 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇదే సమయంలో స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 23.30 డాలర్ల వద్ద ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి