P Krishna
పసిడి కొనుగోలు దేశంలో విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం దేశంలో పండుగలు, శుభకార్యాలకు మహిళలు ఎక్కువగా బంగారం ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు.. దీంతో గోల్డ్ కి బాగా డిమాండ్ పెరిగింది.
పసిడి కొనుగోలు దేశంలో విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం దేశంలో పండుగలు, శుభకార్యాలకు మహిళలు ఎక్కువగా బంగారం ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు.. దీంతో గోల్డ్ కి బాగా డిమాండ్ పెరిగింది.
P Krishna
గత ఏడాది సెప్టెంబర్ లో బంగారం ధరలు చాలా వరకు తగ్గాయి.. ఆ తర్వాత నుంచి వరుసగా పసిడి ధరలు పెరిగిపోతూ వచ్చాయి. ఒకదశలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.63 దాటిపోయింది. దానితో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ ద్రవ్యోల్బణంలో వస్తున్న మార్పులు, ఆర్థిక మాంద్యం తో పాటు ఇజ్రాయిల్, పాలస్తీనాల మధ్య యుద్ద ప్రభావం కూడా బంగారంపై పడుతుంది. ఈ క్రమంలోనే రెండు మూడు నెలల నుంచి పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు వస్తున్నాయి. బంగారం ధరలు కొత్త ఎడాది మొదటి రెండు రోజులు కాస్త పెరిగినా మూడో రోజు నుంచి స్థిరంగా కొనసాగుతూ తగ్గుముఖం పట్టాయి. గత రెండు రోజులుగా మార్కెట్ లో గోల్డ్ రేట్ భారీగా తగ్గుతూ వచ్చింది. నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
గోల్డ్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదో మంచి సువర్ణావకాశం. వరుసగా రెండు రోజుల నుంచి పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. పండగలు, పెళ్లిళ్లు, ఇతర వేడుకలు, శుభకార్యాలకు బంగారు ఆభరణాలు ధరించేందుకు ఇష్టపడుతుంటారు. జ్యులరీ షాపుల్లో లేటెస్ట్ ఆర్నమెంట్స్ కొంటుంటారు. ఇవి మహిళల అందాన్ని మరింత పెంచుతుంది. సొసైటీలో గౌరవం కూడా ఉంటుంది. అంతేకాదు బంగారం ఇన్వెస్ట్ మెంట్ గా కూడా పనికి వస్తుంది. ఆపద సమయంలో సెక్యూర్ గా ఉంటుంది. అందుకే చాలా మంది పసిడి కొనుగోలుపై దృష్టిపెడుతున్నారు. కొద్దిరోజులుగా బంగారం గరిష్టానికి చేరుకున్న పసిడి క్రమంగా దిగి వస్తుంది. ఇలాంటి సమయంలోనే గోల్డ్ కొనుగోలు చేస్తే మంచిదని నిపుణులు అంటున్నారు. తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విశాఖ, విజయవాడ లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 58,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.63,270 వద్ద ట్రెండ్ అవుతుంది.

దేశంలో ప్రధాన నగరాలు ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 58,150 వద్ద ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.63,430 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 58,600 వద్ద ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,940 వద్ద కొనసాగుతుంది. దేశ ఆర్ధిక రాజధాని ముంబై తో పాటు కోల్‌కతా, బెంగళూరు, కేరళాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.58,000 వద్ద ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.63,430 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి విషయానికి వస్తే.. కోల్‌కతా, ఢిల్లీ, ముంబై, పుణె, కిలో వెండి ధర రూ. 76,600 వద్ద కొనసాగుతుంది. బెంగళూరులో రూ.76,500, తెలుగు రాష్ట్రాలతో సహా కేరళ, చెన్నైలో కిలో వెండి ధర రూ. 80,000 వద్ద ట్రెండ్ అవుతుంది.