Gold and Silver Rates: తగ్గేదే లే అంటున్న పసిడి.. ఈ రోజు ధర ఎంతంటే?

తగ్గేదే లే అంటున్న పసిడి.. ఈ రోజు ధర ఎంతంటే?

Gold and Silver Rates: బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే.. ప్రపంచ వ్యాప్తంగా పసిడికి ఎంతో డిమాండ్ ఉంది. అందుకే ప్రతి ఏడాది వేలల్లో పెరిగిపోతూ వస్తుంది. గత కొన్నిరోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి మళ్లీ పెరిగిపోయింది.

Gold and Silver Rates: బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే.. ప్రపంచ వ్యాప్తంగా పసిడికి ఎంతో డిమాండ్ ఉంది. అందుకే ప్రతి ఏడాది వేలల్లో పెరిగిపోతూ వస్తుంది. గత కొన్నిరోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి మళ్లీ పెరిగిపోయింది.

దేశంలో పసిడి కొనుగోలు భారీగా పెరిగిపోయింది. ఒకప్పుడు బంగారం అంటే కేవలం మహిళలు అభరణాలుగా మాత్రమే ధరించేవారు.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. బంగారంపై పెట్టుబడి పెడితే భవిష్యత్ లో రెట్టింపు ధరల పలికి మంచి లాభం ఉంటుందని భావిస్తున్నారు.అందుకే ఎక్కువగా మధ్యతరగతి వారు బంగారం‌పై ఇన్వెస్ట్‌మెంట్ పెడుతున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాలు, పలు దేశాల్లో యుద్దాలు వేరసి పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి.. దీంతో పసిడి, వెండి ధరలు నిరంతరం తగ్గుతూ, పెరుగుతూ వస్తున్నాయి. నేడు మార్కెట్ లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. వివరాల్లోకి వెళితే..

గత ఐదు రోజుల నుంచి పసిడి, వెండి ధరలు తగ్గుతూ ఊరటనిచ్చాయి. కానీ శుక్రవారం మళ్లీ పెరిగాయి. ఒక్కరోజే బంగారం పై వెయ్యికి పైగా పెరిగింది.. వెండి మూడు వేలకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ లో చోటు చేసుకుంటున్నా పరిణామాలు.. డాలర్ తో రూపాయి మారకం పడిపోవడం వంటి కారణాలు పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. గత నెల చివరి నుంచి పసిడి ధరలు తగ్గుతూ వచ్చాయి. అప్పుడప్పుడు పెరుగుతూ పోయాయి. ఐదు రోజుల నుంచి పసిడి ధరలు కాస్త ఊరటనిచ్చినా.. నిన్నటి నుంచి మళ్లీ చుక్కలు చూపిస్తున్నాయి. శనివారం స్వల్పంగా పెరిగాయి. 24, 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి పై రూ.10 పెరిగింది. తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖలో 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.67, 610గా పలుకుతుంది. 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.73,760 వద్ద ట్రెండ్ అవుతుంది.

దేశంలోని ప్రధాన నగరాలు ఢిల్లీలో 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.67,760 గా ఉండగా.. 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.73,910 వద్ద కొనసాగుతుంది. ముంబై, కేరళ, బెంగుళూరు లో 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.67,610 గా ఉండగా.. 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.73,760 వద్ద కొనసాగుతుంది.చెన్నైలో 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.68,410 గా ఉండగా.. 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.74,630 వద్ద కొనసాగుతుంది.ఇక దేశ వ్యాప్తంగా కిలో వెండి ధర కిలో వెండిపై రూ. 100 పెరిగింది.హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 10,060 వద్ద ట్రెండ్ అవుతుంది. కోల్‌కొతా లో కిలో వెండి ధర రూ. 96,100 కి చేరింది. బెంగుళూరు లో కిలో వెండి ధర రూ. 93,350 వద్ద ట్రెండ్ అవుతుంది.

Show comments