P Krishna
Gold and Silver Rates: గత ఏడాది నుంచి పసిడి, వెండి ధరలు వరసగా పెరుగుతూ వచ్చాయి. ఒకదశలో సామాన్యులు పసిడి కొంటామా అన్న అనుమానాలు కలిగాయి.
Gold and Silver Rates: గత ఏడాది నుంచి పసిడి, వెండి ధరలు వరసగా పెరుగుతూ వచ్చాయి. ఒకదశలో సామాన్యులు పసిడి కొంటామా అన్న అనుమానాలు కలిగాయి.
P Krishna
దేశంలో పసిడి అంటే ఇష్టపడని వారు ఉండరు. మహిళలు ఎన్నో రకాల ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. పండుగలు, వివాహాది శుభకార్యాలకు పసిడి కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. కానీ ఇటీవల బంగారం రోజు రోజుకీ పెరిగిపోతూ సామాన్యులక చుక్కలు చూపిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాలు పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపించడం వల్ల తరుచూ మార్పులు చేర్పులు జరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. గత రెండు రోజుల నుంచి పసిడి తగ్గుతూ వస్తుంది. వివరాల్లోకి వెళితే..
మహిళలకు శుభవార్త.. పసిడి ధరలు మళ్లీ తగ్గాయి. వరుసగా మూడు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ రావడంతో పసిడి కొనుగోలుదారులు జ్యూలరీ షాపులకు క్యూ కడుతున్నారు. ఇటీవల మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారు బంగారం ఆభరణాలు గా మాత్రమే కాదు.. భవిష్యత్ లో పసిడి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందన్న ఉద్దేశంతో కొని పెట్టుకుంటున్నారు. ఆదివారం (జూన్ 1) నాటికి పసిడి ధర రూ.200 వరకు తగ్గింది. . తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విశాఖ, విజయవాడలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.66,500 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.72,550 వద్ద కొనసాగుతుంది.
ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.66,650 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ. 72,700 వద్ద కొనసాగుతుంది. ముంబై, కోల్‌కొతా, కేరళాాలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ. 66,500 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.72,550 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ. 67,100 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.73,200 వద్ద కొనసాగుతుంది. హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 98,000 కి చేరింది. ముంబై, కోల్ కొతా లో కిలో వెండి రూ.93,500, కేరళాలో రూ.99,900, బెంగుళూరులో కిలో వెండి ధర రూ. 93,500 వద్ద ట్రెండ్ అవుతుంది. చెన్నైలోకిలో వెండి ధర రూ.98,000వద్ద కొనసాగుతుంది.