iDreamPost
android-app
ios-app

పసిడి ప్రియులకు బంగారం లాంటి వార్త.. ఈ రోజు ఎంతంటే?

Gold and Silver Rates: దేశంలో ఇటీవల పసిడి, వెండి ధరల చుక్కలు చూపించాయి.. కానీ ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లో కీలక పరిణామాల నేపథ్యంలో భారీగా తగ్గుముఖం పట్టాయి.

Gold and Silver Rates: దేశంలో ఇటీవల పసిడి, వెండి ధరల చుక్కలు చూపించాయి.. కానీ ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లో కీలక పరిణామాల నేపథ్యంలో భారీగా తగ్గుముఖం పట్టాయి.

పసిడి ప్రియులకు బంగారం లాంటి వార్త.. ఈ రోజు ఎంతంటే?

ఇటీవల పసిడి, వెండి ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి లో భారీగా తగ్గిన బంగారం ధరలు మార్చి నుంచి మే వరకు పరుగులు పెట్టింది. గత పది రోజులుగా పసిడి, వెండి నేల వంక చూస్తున్నాయి. దేశంలో పసిడి కొనుగోలు పెరిగిపోవడంతో డిమాండ్ కూడా పెరిగిపోయింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ లో కొనసాగుతున్న ప్రతికూల పరిస్థితులు బంగారం, వెండి పై పడటం వల్ల తగ్గుముఖం పడుతున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వేసవి కాలం అయినప్పటికీ ప్రస్తుతం ముహూర్తాలు లేని కారణంగా వివాహాది శుభకార్యాలు లేవు. కాకపోతే రాబోయ రోజుల్లో పసిడి రూ.80 మార్క్ దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఈ రోజు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మొన్నటి వరకు పసిడి చుక్కలు చూపించింది. ఒకదశలో సామాన్యులు బంగారం కొనగలమా అన్న ఆందోళన కలిగింది. వరుసగా పెరుగుతూ వచ్చిన పసిడి, వెండి ధరలే పది రోజుల నుంచి వరుసగా తగ్గుముఖం పట్టాయి. దానికి తోడు ప్రస్తుతం పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలు ఏవీ లేవు. దీంతో పసిడి, వెండి ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గడిచిన మూడు రోజుల నుంచి బంగారం తగ్గుతూ వస్తుంది. ఇలాంటి సమయంలో పసిడి కొనుగోలు చేయాలనుకునే వారికి గొప్ప శుభవార్త. సోమవారం (మే27) బంగారం ధర రూ.10 తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,400 ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,440 వద్ద కొనసాగుతుంది.

Gold Rates Today

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ రూ. 72,590 వద్ద కొనసాగుతోంది. చెన్నైలొ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ రూ.72,600 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కొతా, బెంగుళూరు లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ రూ.72,440 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ. 96,000 వద్ద కొనసాగుతుంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కొతా లో కిలో వెండి ధర రూ. 91,500 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 95,900 వద్ద ట్రెండ్ అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి