iDreamPost
android-app
ios-app

దూసుకుపోతున్న పసిడి ధరలు.లక్ష దాటిన వెండి! ఈ రోజు ఎంతంటే?

  • Published May 21, 2024 | 8:01 AM Updated Updated May 21, 2024 | 8:01 AM

Gold and Silver Rates: బంగారం ధరలు తగ్గేదే లే అన్నట్లు ఒకటీ రెండు రోజులు కాస్త ఊరటనిచ్చినా.. మళ్లీ పెరిగిపోతుంది. నిన్న మొన్న, నిన్న పసిడి ధరలు స్థిరంగా ఉన్నా.. మళ్లీ పెరిగిపోయాయి.

Gold and Silver Rates: బంగారం ధరలు తగ్గేదే లే అన్నట్లు ఒకటీ రెండు రోజులు కాస్త ఊరటనిచ్చినా.. మళ్లీ పెరిగిపోతుంది. నిన్న మొన్న, నిన్న పసిడి ధరలు స్థిరంగా ఉన్నా.. మళ్లీ పెరిగిపోయాయి.

దూసుకుపోతున్న పసిడి ధరలు.లక్ష దాటిన వెండి! ఈ రోజు ఎంతంటే?

బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే. మంచి చేసేవాళ్లను.. అపురూపంగా ఉండేవాళ్లను బంగారంతో పోల్చుతూ బంగారు కొండ అంటారు. భారత దేశంలో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు పసిడి అంటే ఎంతో ఇష్టపడతారు. ఒకప్పుడు బంగారం అంటే ఆభరణాలుగా మాత్రమే చూసేవారు.. కానీ ఇప్పుడు బంగారం ఒక ఇన్వెస్ట్ మెంట్ గా చూస్తున్నారు. ఇటీవల పసిడి ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి.. అందుకే దీనిపై ఎక్కువగా పెట్టుబడి పెట్టేవారి సంఖ్య పెరిగిపోతుంద.దీంతో దేశంలో పసిడి ధరలకు రెక్కలు వస్తున్నాయి. ఈ నెలలో కాస్త తగ్గుముఖం పట్టినట్టే పట్టి మళ్లీ పెరుగుతుంది. నిన్న కాస్త ఊరటనిచ్చిన పసిడి మళ్లీ పెరిగింది. ఈ రోజు మార్కెట్ లో పసిడి ధర ఎంతంటే?

బంగారం ధరలు అస్సలు తగ్గేదే లే అన్న చందంగా రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉంది.వారం రోజులుగా కాస్త శాంతిస్తున్నాయి అనుకుంటున్న సమయానికే మళ్లీ చుక్కలు చూపిస్తుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో మేలిమి బంగారం రూ.75 వేల మార్కును దాటేసింది. దీని బాటలోనే వెండి.. ఏకంగా లక్ష దాటిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాలు పసిడి, వెండిపై తీవ్ర ప్రభావం చూపించడం వల్ల ధరలకు రెక్కలొచ్చాయని అంటున్నారు ఆర్థిక నిపుణులు.24 క్యారెట్ 10 గ్రాముల బంగారం పై రూ.540 పెరిగింది. వెండిపై రూ.1700 పెరిగింది.తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖలో 22 క్యారెట్ 10 గ్రాముల పసడి రూ.68,910 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల పసడి ధర రూ. 75,170కి చేరుకుంది.

దేశంలోని ప్రధాన నగరాలు ఢిల్లీ 22 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.69,060 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.75,320 కి చేరుకుంది. ముంబై, కోల్ కొతా, కేరళా, పూణేలో 22 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.68,910 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.75,170 కి చేరుకుంది. చెన్నైలో 22 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.69,010 ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.75,290 కి చేరుకుంది. ఇక వెండి ధరల విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.1,01,100 కు చేరింది. ముంబై, బెంగుళూరు, కోల్‌కొతాలో రూ.96,600 గా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.96,600, చెన్నై, కేరళాలో రూ.1,01,100 వద్ద ట్రెండ్ అవుతుంది.