P Krishna
Gold and Silver Rates: దేశంలో అక్షయ తృతీయ పండుగ సందర్భంగా ఒక్క గ్రాము బంగారం అయినా కొనాలనే సెంటిమెంట్ ఉంటుంది. గత వారం నుంచి పసిడి నేల చూపు చూస్తుంది.
Gold and Silver Rates: దేశంలో అక్షయ తృతీయ పండుగ సందర్భంగా ఒక్క గ్రాము బంగారం అయినా కొనాలనే సెంటిమెంట్ ఉంటుంది. గత వారం నుంచి పసిడి నేల చూపు చూస్తుంది.
P Krishna
భారత దేశంలో పసిడి కొనుగోలు బాగా పెరిగిపోయింది. వివాహాది శుభ కార్యాలకు మహిళలు ఎక్కువగా బంగారం, వెండి కొనుగోలు చేస్తున్నారు. గత రెండు నెలలుగా చుక్కలు చూపిస్తున్న బంగారం పది రోజుల నుంచి తగ్గుముఖం పట్టింది. ఒకటీ రెండు రోజులు స్వల్పంగా పెరిగినప్పటికీ వెంటనే తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాలు పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపించడం వల్ల తరుచూ ధరల్లో మార్పులు వస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ధరలు ఎంత పెరిగినా.. పుత్తడి కొనుగోలు మాత్రం అస్సలు తగ్గడం లేదు. అక్షయతృతీయకు బంగారం కొనాలనుకునేవారికి గోల్డెన్ ఛాస్సు. ఈ రోజు పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలలో పసిడి చాలా వరకు తగ్గుముఖం పట్టింది. మార్చి, ఏప్రిల్ నెలలో అమాంతం పెరిగిపోయాయి. ఒక దశలో మేలిమి బంగారం రూ.75 మార్క్ దాటిపోయింది. గత వారం రోజులుగా బంగారం రేటు తగ్గుతూ వస్తుంది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ప్రకటన తర్వాత పుత్తడి ధర పడిపోయింది.భారత దేశంలో అక్షయ తృతీయ పండుగ సందర్భంగా ఒక్క గ్రాము బంగారం అయినా కొనాలనే సెంటిమెంట్ ఉంది. ఇందుకోసం మహిళలు జ్యులరీ షాపులకు క్యూ కడుతుంటారు. దేశ వ్యాప్తంగా అక్షయ తృతీయ రోజు జ్యులరీ షాపులు కిట కిటలాడిపోతుంటాయి. పసిడి కొనుగోలు దారులకు బంగారం లాంటి శుభవార్త. తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విశాఖ, విజయవాడలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ. 10 తగ్గి ప్రస్తుతం రూ.71,820 వద్ద కొనసాగుతుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ. 10 తగ్గి ప్రస్తుతం రూ.65,840 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రముఖ నగరాలు ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.71,820 వద్ద కొనసాగుతుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.65,840 వద్ద ట్రెండ్ అవుతుంది.ముంబై, కేరళా, కల్‌కతా, బెంగుళూరు లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.71,820 వద్ద కొనసాగుతుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.65,840 వద్ద ట్రెండ్ అవుతుంది.చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.71,990 వద్ద కొనసాగుతుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.65,990 వద్ద ట్రెండ్ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ. 200 వరకు తగ్గి ప్రస్తుతం రూ.86,400 వద్ద ట్రెండ్ అవుతుంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 82,900 ఉంది. ముంబై రూ. 82,900, బెంగుళూరులో రూ.82,500 వద్ద కొనసాగుతుంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ. 86,400 వద్ద ట్రెండ్ అవుతుంది.