P Krishna
Gold and Silver Rates: గత కొన్నిరోజులుగా బంగారం ఆకాశమే హద్దుగా ధరలు పెరిగిపోతూ వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక మార్పులు పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి
Gold and Silver Rates: గత కొన్నిరోజులుగా బంగారం ఆకాశమే హద్దుగా ధరలు పెరిగిపోతూ వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక మార్పులు పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి
P Krishna
గత కొన్నిరోజులుగా పరుగులు పెడుతున్న పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టడంతో కొనుగోలుదారులకు కాస్త ఊరట లభించింది. అక్షయ తృతీయ సందర్భంగా గోల్డ్, వెండి కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. మొన్నటి వరకు పరుగులు పెట్టిన పుత్తడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాల ప్రభావం పసిడి, వెండి ధరలపై పడుతుందని అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఈ కారణం చేత తరుచూ ధరల్లో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. గత వారంతో పోల్చితే ఆదివారం నుంచి బంగారం ధర నేల చూపు చూస్తుంది. పసిడి, వెండి కొనుగోలుదారులకు ఇదే మంచి సమయం అంటున్నారు నిపుణులు. ఈ రోజు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎంత ఉన్నాయో చూద్దాం.
దేశంలో పసిడి అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. అందుకే ఎక్కడలేని డిమాండ్ దీనికి ఉంటుంది. ఇటీవల బంగారం ధరలు రాకెట్ లా దూసుకువెళ్తున్న విషయం తెలిసిందే. మహిళలు శుభకార్యాలకు పసిడి, వెండి ఎక్కువగా కొనుగోలు చేయడంతో కొంత కాలంగా ధరలు భారీగా పెరిగిపోతూ వచ్చాయి. ఇలాంటి సమయంలో పసిడి, వెండి ధరలు గత మూడు నాలుగు రోజుల నుంచి తగ్గుముఖం పట్టాయి. అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఊరటనిచ్చే వార్త. నిన్నటితో పోల్చుకుంటే.. పసిడి ధర 24 క్యారెట్ల 10 గ్రాములపై రూ.330 తగ్గింది. ప్రస్తుతం బంగారం ధర రూ.72,600 దిగి వచ్చింది. 22 క్యారెట్ల 10 గ్రాములపై రూ.300 తగ్గింది. ప్రస్తుతం బంగారం ధర రూ.66,550 దిగి వచ్చింది. తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,600 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,550 వద్ద కొనసాగుతుంది.
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,590 దిగి వచ్చింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,540 వద్ద కొనసాగుతుంది. ముంబై, బెంగుళూరు, కోల్‌కొతా, కేరళాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,590 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,540 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,520 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,390 వద్ద కొనసాగుతుంది. దేశ వ్యాప్తంగా వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. నేడు కిలో వెండి ధర రూ. 83,900 వద్ద కొనసాగుతుంది.