iDreamPost
android-app
ios-app

అక్షయ తృతీయ ముందు పసిడి ప్రియులకు గొప్ప ఊరట.. ఈ రోజు ధర ఎంతంటే!

  • Published Apr 24, 2024 | 8:42 AM Updated Updated Apr 24, 2024 | 8:42 AM

Gold and Silver Rates: ఇటీవల పసిడి పరుగులు పెడుతూ వస్తుంది. గత మూడు రోజుల నుంచి పరుగులకు బ్రేక్ పడింది. అక్షయ తృతీయ ముందు పసిడి ప్రియులకు గొప్ప ఊరట కలిగించే శుభవార్త.

Gold and Silver Rates: ఇటీవల పసిడి పరుగులు పెడుతూ వస్తుంది. గత మూడు రోజుల నుంచి పరుగులకు బ్రేక్ పడింది. అక్షయ తృతీయ ముందు పసిడి ప్రియులకు గొప్ప ఊరట కలిగించే శుభవార్త.

అక్షయ తృతీయ ముందు పసిడి ప్రియులకు గొప్ప ఊరట.. ఈ రోజు ధర ఎంతంటే!

భారత దేశంలో బంగారం అంటే ఆడ, మగ తేడా లేకుండా ఎంతగానో ఇష్టపడుతుంటారు. ఎన్నో రకాల బంగారు నగలు ప్రతిరోజూ జ్యూలరీ షాపుల్లో దర్శనమిస్తుంటాయి. వేసవి కాలం వచ్చేసింది.. ఇప్పుడు పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలకు మహిళలు బంగారం కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. గత కొన్ని రోజుగా వరుసగా పెరిగిపోతూ వచ్చిన బంగారం ధరలు గత మూడు నాలుగు రోజులుగా భారీగా తగ్గుతూ వచ్చాయి. ధరలు తగ్గడం అనేది కంటితుడుపుగానే ఉంటుంది. మళ్లీ పసిడి ధరలు ఎప్పుడు పెరుగుతాయో ఊహించలేం. పసిడి ధరలు తగ్గినపుడు.. స్థిరంగా ఉన్నపుడు కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. నేడు మార్కెట్ లో బంగారం, వెండి ధరల విషయానికి వస్తే..

గత మూడు రోజులుగా పసిడి ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాలు బంగారం, వెండి ధరలపై చూపించడంతో తరుచూ ధరల్లో మార్పులు.. చేర్పులు జరుగుతున్నాయి. అక్షయ తృతయ సందర్భంగా పసిడి కొనుగోలు చేసేవారికి గొప్ప శుభవార్త. గ్లోబల్ సిగ్నల్ చాలా బలహీనంగా ఉండటం వల్ల మూడు రోజులగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1530 తగ్గి రూ. 72,160కి చేరుకున్నది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరలపై రూ.1400 తగ్గి రూ.66,150కి చేరుకున్నది. ఇంత పెద్ద మొత్తంలో తగ్గడం ఇటీవల ఇదే అంటున్నారు. మరోవైపు వెండి ధరలు కూడా భారీగా దిగి వచ్చాయి. కిలో వెండి పై రూ.2,300 తగ్గి రూ.85,800 నుంచి రూ.83,500 కి దిగివచ్చింది. హైదరాబాద్ లో కిలో వెండి రూ.2,500 తగ్గి రూ.86,500 గా నమోదు అయ్యింది. అంతకు ముందు కిలో వెండి ధర రూ.89 వేలకు చేరుకుంది.

A big relief for pasidi lovers before Akshaya Tritiya

ప్రధాన నగరాల్లో నేడు బంగారం ధరల విషయానికి వస్తే..దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,310 గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,300 వద్ద కొనసాగుతుంది. ముంబై, కకోల్‌కతా, బెంగళూరు, కేరళలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,160 గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,150 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.73,090 గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,990 వద్ద కొనసాగుతుంది.