P Krishna
Gold and Silver Rates: ఈ మధ్య దేశంలో బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతన్నాయో.. ఎప్పుడు తగ్గుతున్నాయో అర్థం కాని పరిస్థితి.. బంగారం ధరలు స్థిరంగా ఉన్నపుడు కొనుగోలు చేయడం మంచిదని అంటున్నారు నిపుణులు.
Gold and Silver Rates: ఈ మధ్య దేశంలో బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతన్నాయో.. ఎప్పుడు తగ్గుతున్నాయో అర్థం కాని పరిస్థితి.. బంగారం ధరలు స్థిరంగా ఉన్నపుడు కొనుగోలు చేయడం మంచిదని అంటున్నారు నిపుణులు.
P Krishna
ఇటీవల పసిడి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఒకటీ రెండు రోజుల తప్ప ఆల్ టైమ్ రికార్డు ధరలకు చేరుతున్నాయి. ప్రస్తుతం సమ్మర్ సీజన్ కావడంతో పెళిళ్ళు ఇతర శుభకార్యాలకు మహిళలు ఎక్కువ బంగారం కొనుగోలు చేస్తుంటారు. గత కొంత కాలంగా పసిడి ధరలకు రెక్కలు వచ్చాయి. గత వారం రోజుల క్రితం భారీగా పెరిగిపోయిన బంగారం ధరల మొన్న కాస్త ఊరటనిచ్చాయి. మళ్లీ నిన్న పెరిగిపోయింది. దేశంలో పసిడి ధరలు ఆదివారం స్థిరంగా ఉండటంతో కొనుగోలుదారులకు ఇదే మంచి సమయం అంటున్నారు నిపుణులు. నేడు మార్కెట్ లో పసిడి, వెండి ధరల విషయానికి వస్తే..
ప్రపంచంలో బంగారం అంటే ఇష్టపడని వారు ఉంటారు. దీంతో పసిడికి విపరీతమైన డిమాండ్ పెరిగిపోతుంది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాల కారణంగా బంగారం, వెండి ధరల్లో తరుచూ మార్పులు జరుగుతున్నాయని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. పసిడి ధర మొన్న తగ్గినట్టే తగ్గి నిన్న మళ్లీ షాక్ ఇచ్చింది. ఆదివారం బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. శనివారం 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.68,05 వద్ద ఉంది.. నేడు అదే ధర కొనసాగుతుంది. అలాగే 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.74,240 వద్ద ఉండగా ఆదివారం అదే ధర స్థిరంగా కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విశాఖ, విజయవాడ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,050 వద్ద ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,240 వద్ద కొనసాగుతుంది. కేజీ వెండి ధరపై 90 వేలకు చేరింది.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.68,210 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,390 వద్ద కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై, బెంగుళూరు, కోల్‌కొతా, కేరళాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 68,050 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.74,240 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.75,110 వద్ద కొనసాగుతుంది.ఢిల్లీలో రూ.86,500 గా వద్ద ట్రెండ్ అవుతుంది. ముంబై, కోల్ కతా లో కిలో వెండి ధర రూ.85,900 వద్ద ట్రెండ్ అవుతుంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.90,000 కు చేరింది. రేపు మార్కెట్ లో బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పులు ఉండబోతాయో చూడాలి.