P Krishna
Gold and Silver Rates: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. దీంతో మహిళలు బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేయడానికి జ్యులరీ షాపులకు క్యూ కడుతున్నారు.
Gold and Silver Rates: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. దీంతో మహిళలు బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేయడానికి జ్యులరీ షాపులకు క్యూ కడుతున్నారు.
P Krishna
ఇప్పుడు మార్కెట్ లో బంగారం, వెండికి ఎంత విలువ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బంగారం ఆభరణాలు మాత్రమే కాదు.. పెట్టుబడి మార్గంగా మలుచుకుంటున్నారు. రోజు రోజుకీ పెరిగిపోతున్న బంగారం, వెండి ధరలు మరికొన్ని రోజుల్లో 80 వేలు దాటే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి 72 మార్క్ దాటిలే.. 10 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.65 వేల మార్క్ దాటింది. గత ఏడాదితో పోల్చితే దాదాపు ఆరు వేలకు పైగా బంగారంలో మార్పు వచ్చింది. ఉగాది పండుగ సందర్భంగా స్వల్పంగా పసిడి ధర తగ్గుముఖం పట్టింది. బుధ వారం మార్కెట్ లో బంగారం, వెండి ధరల ఎంత ఉన్నాయో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..
గత ఏడాది చివరల్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగినప్పటికీ జనవరి, ఫిబ్రవరి మాసంలో చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. ఆ సమయంలో పసిడి కొనుగోలు విపరీతంగా పెరిగిపోయింది. మార్చి నెలలో మళ్లీ పసిడి, వెండి ధరలు పుంజుకున్నాయి. రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో ధరలు పెరిగిపోయాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం, వెండికి భారీగా డిమాండ్ ఉండటంతో భవిష్యత్ లో మరింత పెరిగే అవకాశం ఉందని.. పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలకు బంగారం కొనుగోలు చేయడానికి ఇదే మంచి తరుణం అంటున్నారు నిపుణులు. మొన్నటి వరకు బెంబేలెత్తించిన పసిడి రెండు మూడు రోజులుగా కాస్త ఊరటనిస్తుంది. ఉగాది పండుగ సందర్భంగా స్వల్పంగా తగ్గింది. నేడు మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్,వరంగల్, విశాఖ, విజయవాడ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,740 వద్ద కొనసాగుతుంది. కిలో వెండి ధర రూ. 83,400 వద్ద కొనసాగుతుంది.
ప్రధాన నగరాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,440 వద్ద కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై, బెంగుళూరు, కోల్‌కొతా, కేరళాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.65,760లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.71,740 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,710 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,770 వద్ద కొనసాగుతుంది. బెంగుళూరు లో కిలో వెండి ధర రూ.76,600, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి ధర రూ.84,400 వద్ద ట్రెండ్ అవుతుంది. చెన్నై కిలో వెండి ధర రూ.87,900 లు ఉండగా, ఢిల్లీ లో రూ.84,400 వద్ద ట్రెండ్ అవుతుంది. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయం అంటున్నారు నిపుణులు. రేపు మార్కెట్ లో బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పులు ఉండబోతాయో చూడాలి.