P Krishna
Gold and Silver Rates: ఇటీవల మార్కెట్ లో బంగారం ఎప్పుడు పెరుగుతుందో.. ఎప్పుడు తగ్గుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం పసిడిపై భారీగా చూపిస్తుంది.
Gold and Silver Rates: ఇటీవల మార్కెట్ లో బంగారం ఎప్పుడు పెరుగుతుందో.. ఎప్పుడు తగ్గుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం పసిడిపై భారీగా చూపిస్తుంది.
P Krishna
ప్రపంచంలో బంగారం అంటే ప్రతి ఒక్కరూ ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పన్కరలేదు. ఇటీవల బంగారం కొనుగోలు భారీగా పెరిగిపోవడంతో డిమాండ్ కూడా అదే స్థాయిలో పెరిగిపోతూ వస్తుంది. జనవరి, ఫిబ్రవరి మాసంలో పసిడి ధరలు కాస్త పరవాలేదు అనిపించినా.. మార్చి, ఏప్రిల్ లో చుక్కలు చూపిస్తుంది. దానికి తోడు ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనుగోలు విపరీతంగా పెరిగిపోయింది. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణమాలు పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపించడం వల్ల తరుచూ మార్పులు సంభవిస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. బంగారం కొనుగోలుదారులకు కాస్త ఊరటనిచ్చే విషయం.. నిన్నటి వరకు పరుగులు పెట్టించిన పసిడి ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి.నేడు మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
గత వారం రోజులుగా బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70 వేల మార్కును దాటిపోయింది. ఇక వెండి కిలో రూ.80 వేల మార్క్ దాటిపోయింది. దీంతో పసిడి, వెండి కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఇక పెళ్లిళ్ల సీజన్ రాబోతుంది.. అప్పుడు పరిస్థితి ఏంటా ? అని బెంబెలెత్తిపోతున్నారు. ఇటీవల పసిడి, వెండి ధరలు నాన్ స్టాప్ గా పెరిగిపోతూ వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో పసిడికి డిమాండ్ పెరిగిపోతున్న నేపథ్యంలో భవిష్యత్ లో ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపర వర్గాలు చెబుతున్నాయి. నిన్నటితో పోల్చుకుంటే పసిడి ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.10 కి తగ్గి.. రూ71,430 గా నమోదు అయ్యింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 కి తగ్గి.. రూ.61,490 గా పలుకుతుంది. హైదరాబాద్ మార్కెట్ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి, రూ. 71, 430 గా నమోదు కాగా.. అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి, రూ. 65, 490 గా పలుకుతుంది.
ప్రధాన నగరాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,440 వద్ద కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై, బెంగుళూరు, కోల్‌కొతా, కేరళాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.65,350లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.71,290 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,160వద్ద కొనసాగుతుంది. బెంగుళూరు లో కిలో వెండి ధర రూ.76,600, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి ధర రూ.83,400 వద్ద ట్రెండ్ అవుతుంది. చెన్నై కిలో వెండి ధర రూ.86,900 లు ఉండగా, ఢిల్లీ లో రూ.83,400 వద్ద ట్రెండ్ అవుతుంది. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే సరైన సమయం అంటున్నారు నిపుణులు. రేపు మార్కెట్ లో బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పులు ఉండబోతాయో చూడాలి.