P Krishna
Gold and Silver Rates: ఇటీవల బంగారం ధరలు చుక్కలు చూపించాయి.. గత వారం పది రోజుల నుంచి కాస్త ఊరటనిస్తూ తగ్గుముఖం పట్టాయి.
Gold and Silver Rates: ఇటీవల బంగారం ధరలు చుక్కలు చూపించాయి.. గత వారం పది రోజుల నుంచి కాస్త ఊరటనిస్తూ తగ్గుముఖం పట్టాయి.
P Krishna
దేశంలో ఇటీవల పసిడి ధరలు బాగా పెరిగిపోతూ వస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా 24 క్యారెట్స్ 10 గ్రాములు రూ.65 వేల మార్క్ దాటిపోయింది. ఇక 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం రూ.62 వేల మార్క్ దాటింది. ఇటీవల వరుసగా పెరుగుతూ వచ్చిన పసిడి కాస్త తగ్గుముఖం పట్టింది. నిన్న రూ.250 మేర తగ్గిన బంగారం ధర నేడు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతుంది. వెండి ధర కూడా స్థిరంగా కొనసాగుతుంది. బంగారం ధరలు తగ్గుముఖం పట్టినపుడు కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఏప్రిల్ 1, సోమవారం మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బంగారం అంటే ప్రతి ఒక్కరూ ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. బంగారంతో ఎన్నో రకాల డిజైన్లు తయారు చేస్తారు.. వాటిని ధరించేందుకు మహిళలు ఎంతగానో ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం పెళ్లిళ్లు.. ఇతర శుభకార్యాల సీజన్ నడుస్తుంది. దీంతో మహిళలు జ్యులరీ షాపులకు క్యూ కడుతున్నారు. వారం పది రోజుల నుంచి పసిడి ధరలు కాస్త ఊరటనిస్తున్నాయి. ఈ సమయంలో బంగారం, వెండి కొంటే మంచిదని నిపుణులు అంటున్నారు. తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ లో నేటి గోల్డ్ రేటు ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,740లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,440వద్ద కొనసాగుతుంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.80,900 వద్ద కొనసాగుతుంది.
ప్రధాన నగరాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,890 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,590 వద్ద కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై, బెంగుళూరు, కోల్‌కొతా, కేరళాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.62,740లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.68,440వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,690 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,480వద్ద కొనసాగుతుంది. బెంగుళూరు లో కిలో వెండి ధర రూ.76,900, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి ధర రూ.77,900 వద్ద ట్రెండ్ అవుతుంది. చెన్నై కిలో వెండి ధర రూ.80,900 లు ఉండగా, ఢిల్లీ లో రూ.77,900 వద్ద ట్రెండ్ అవుతుంది. రేపు మార్కెట్ లో బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పులు ఉండబోతాయో చూడాలి.