P Krishna
Gold and Silver Rates: ఈ మధ్య బంగారం ధరలు పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న పరిణామాలు పసిడి, వెండి పై పడుతుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
Gold and Silver Rates: ఈ మధ్య బంగారం ధరలు పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న పరిణామాలు పసిడి, వెండి పై పడుతుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
P Krishna
ప్రపంచంలో ప్రతి ఒక్కరూ బంగారం అంటే ఎంతో ఇష్టపడతారు. ముఖ్యంగా మహిళలు రక రకాల డిజైన్లతో చేసే బంగారు ఆభరణాలు ధరించేందుకు ఎంతో ఉత్సాహపడతారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడం వల్ల జ్యులరీ షాపులకు క్యూ కడుతున్నారు. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాల ప్రభావం బంగారంపై పడుతుంది. ఈ క్రమంలోనే తరుచూ పసిడి, వెండి ధరల్లో మార్పులు జరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. ఈ రోజు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
గత రెండు నెలల క్రితం పసిడి ధరలు గరిష్టంగా తగ్గాయి. మార్చి మొదటి రెండు వారాల్లో భారీగా పెరిగిపోయాయి. వారం రోజులుగా పసిడి ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ షాక్ ఇస్తున్నాయి. వరుసగా రెండో రోజు ధరలు పెరిగి షాక్ ఇచ్చాయి. వేసవి కాలం కావడంతో పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. పసిడికి డిమాండ్ పెరిగిపోయింది. బంగారం బాటలో వెండి నడుస్తుంది. తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్ , విశాఖ, విజయవాడ, 22 క్యారెట్ల 10 గ్రాములకు బంగారం ధర రూ.61,710 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాములకు బంగారం ధర రూ.67,320 వద్ద కొనసాగుతుంది. హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 80,600 వద్ద కొనసాగుతుంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాములకు పసిడి ధర రూ.61,760 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాములకు బంగారం ధర రూ.67,370 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాములకు బంగారం ధర రూ.62,510 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాములకు బంగారం ధర రూ.68,190 వద్ద కొనసాగుతుంది. ముంబై, బెంగుళూరు, కోల్‌కొతా 22 క్యారెట్ల 10 గ్రాములకు పసిడి ధర రూ.61,710 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాములకు పసిడి ధర రూ.67,320 వద్ద కొనసాగుతుంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 77,600, కర్ణాటకలో కిలో వెండి ధర రూ. 77,600, చెన్నైలో కిలో వెండి ధర రూ. 80,500, ముంబైలో కిలో వెండి ధర కిలో రూ. 77,600 వద్ద కొనసాగుతుంది.