P Krishna
Gold and Silver Rates: గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది మొదటి నెల నుంచి బంగారం ధరల్లో భారీ మార్పులు ఏమీ లేవు.. రెండు రోజుల నుంచి స్థిరంగా కొనసాగుతుంది. ఇలాంటి సమయంలో పసిడి కొనుగోలు చేయడం మంచిదని అంటున్నారు నిపుణులు.
Gold and Silver Rates: గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది మొదటి నెల నుంచి బంగారం ధరల్లో భారీ మార్పులు ఏమీ లేవు.. రెండు రోజుల నుంచి స్థిరంగా కొనసాగుతుంది. ఇలాంటి సమయంలో పసిడి కొనుగోలు చేయడం మంచిదని అంటున్నారు నిపుణులు.
P Krishna
దేశంలో బంగారం కొనుగోలు భారీగా పెరిగిపోతుంది. రాబోయే సమ్మర్ సీజన్ లో పెళ్లిళ్ళు.. ఇతర శుభకార్యాలు ఎక్కువగా జరుగుతాయి. ఈ క్రమంలోనే పసిడి కొనుగోలు బాగా పెరిగిపోయింది. శుభకార్యాల కోసం ముందుగానే బంగారం కొనుగోలు చేయడానికి మహిళలు జ్యూలరీ షాపులకు క్యూ కడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో జరిగి పరిణామాల ప్రభావం ఎక్కువగా పసిడి, వెండిపై చూపిస్తుంది. దీంతో తరుచూ ధరల్లో మార్పులు వస్తున్నాయి. గత నెల పసిడి ధరలు చాలా వరకు తగ్గాయి. ఈ నెల మొదటి రోజు పరవాలేదు అనిపించుకున్నా.. మళ్లీ ధరలు పుంజుకున్నాయి. తాజాగా మంగళవారం మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..
గత నెలలో బంగారం, వెండి ధరలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. అయితే నెల చివరల్లో మాత్రం వరుసగా తగ్గుతున్న పసిడి ఒక్కసారే పెరిగింది. ఈ నెలలో మళ్లీ ధరల్లో స్వల్ప మార్పులు వస్తున్నాయి. ఇటీవల స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు వరుసగా రెండోరోజు స్వలప్పంగా తగ్గాయి. 10 గ్రాముల బంగారంపై పది రూపాయలు, కిలో వెండిపై రూ.100 వరకు ధర తగ్గింది. తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ లో నేటి గోల్డ్ రేటు ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 58,740 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.64,080 వద్ద కొనసాగుతుంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.76,900 వద్ద ట్రెండ్ అవుతుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 58,890 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,230 వద్ద కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై,బెంగుళూరు, కోల్‌కొతా, కేరళాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.58,740 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.64,080 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,290 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,680 వద్ద కొనసాగుతుంది. బెంగుళూరు లో కిలో వెండి ధర రూ. 72,650, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి ధర రూ.74,600వద్ద ట్రెండ్ అవుతుంది. చెన్నై కిలో వెండి ధర రూ. 76,900 లు ఉండగా, ఢిల్లీ లో రూ.73,500 వద్ద ట్రెండ్ అవుతుంది. పసిడి ధరలు తగ్గినపుడు కొనుగోలు చేస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు.