P Krishna
Gold and Silver Rates: ఇటీవల బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో కొనుగోలుదారుల సంఖ్య బాగా పెరిగిపోియంది. నేడు మళ్లీ పసిడి ధర స్వల్పంగా పెరిగిపోయింది.
Gold and Silver Rates: ఇటీవల బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో కొనుగోలుదారుల సంఖ్య బాగా పెరిగిపోియంది. నేడు మళ్లీ పసిడి ధర స్వల్పంగా పెరిగిపోయింది.
P Krishna
దేశంలో బంగారం కొనుగోలుదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో పసిడి, వెండికి బాగా డిమాండ్ పెరిగిపోతుంది. గత ఏడాది భారీగా పెరిగిన ధరలు ఈ ఏడాది చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. మహిళలు ఎక్కువ శాతం పండుగలు, పెళ్లిళ్ళు, ఇతర శుభకార్యాలకు బంగారం, వెండి కొనుగోలు చేస్తుంటారు. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాల కారణంగా బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపిస్తుంది. ఈ నెలలో బంగారం, వెండి ధరలు చాలా వరకు తగ్గాయి.. మొన్నటి వరకు స్థిరంగా కొనసాగిన పసిడి ధరలు నేడు మళ్లీ పెరిగాయి. ఆదివారం మార్కెట్ లో పసిడి, వెండి ధరల విషయానికి వస్తే..
ప్రస్తుతం పెళ్లిళ్ళ సీజన్ నడుస్తుంది.. దీంతో ఆదివారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ఇటీల పసిడి, వెండి ఆభరణాలు కొనుగోళ్లు ఊపందుకోవడంతో ధరలు మళ్లీ పెరిగినట్లు చెబుతున్నారు. అంతేకాదు రాబోయే సమ్మర్ సీజన్ లో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు ఎక్కువగా ఉంటాయని.. పసిడి ధరలు మళ్లీ భారీగా పెరిగే అవకాశం ఉందని.. స్థిరంగా ఉన్నపుడు కొనుగోలు చేస్తే చాలా మంచిదని నిపుణులు అంటున్నారు. నిన్నటితో పోల్చితే 22 క్యారెట్ పై రూ.200 పెరిగింది. 24 క్యారెట్ పై రూ.220 వరకు పెరిగింది. తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ లో నేటి గోల్డ్ రేటు ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.57,700 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.62,950 వద్ద కొనసాగుతుంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 76,400 వద్ద స్థిరంగా కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,640 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63, 100 వద్ద కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై,బెంగుళూరు,కోల్‌కొతా, కేరళాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,700 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.62,950 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.58,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.63,490 వద్ద కొనసాగుతుంది. బెంగుళూరు లో కిలో వెండి ధర రూ.72,600, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి ధర రూ.74,400 వద్ద ట్రెండ్ అవుతుంది. చెన్నై కిలో వెండి ధర రూ. 75,900 లు ఉండగా, ఢిల్లీ లో రూ.74,900 వద్ద ట్రెండ్ అవుతుంది.