iDreamPost
android-app
ios-app

గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం ధరలు

  • Published Oct 14, 2023 | 9:03 AM Updated Updated Oct 14, 2023 | 9:03 AM
గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం ధరలు

దేశంలో బంగారం కొనుగోలు రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉంది. గత నెల వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం వారం రోజుల నుంచి మళ్లీ పెరిగిపోతూ వచ్చింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ – పాలస్తినా ల మధ్య కొనసాగుతున్న భీకర యుద్దం కారణంగా ప్రపంచ మార్కెట్ లో అనిశ్చితి ఏర్పడటం వల్ల బంగారంపై భారీగా ప్రభావం చూపించింది. దీంతో పసిడి ధరలు అమాంతం పెరిగిపోతూ వచ్చాయి. రెండు రోజుల నుంచి కాస్త నిలకడగా కొనసాగుతుంది. శుక్రవారంతో పోల్చితే బంగారం ధరల్లో పెద్దగా తేడా లేదు.. దీంతో పసిడి ధరలు శనివారం కాస్త ఊరట కలిగించాయి. నేడు మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

వారం రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చిన పసిడి ధరలు శనివారం కాస్త ఊరట కలిగించాయి. బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,000లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 58,910 వద్ద కొనసాగుతుంది. కాకపోతే వెండి మాత్రం షాక్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో నేడు వెండి ధర రూ.77 వేలకు పెరిగింది. హైదరాబాద్‌, విశాఖ పట్నం,విజయవాడ లో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధరరూ.54,000 గా కొనసాగుతుంది. 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధరూ. 58,910 ట్రెండ్ అవుతుంది. ఇక వెండి ధర విషయానికి వస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కిలో రూ.77,000 గా పలుకుతుంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల విషయానికి వస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,150 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,060 కొనసాగుతుంది. ముంబై, కోల్‌కొతా, బెంగుళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,000లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,910 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో పసిడి ధర బాగానే పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,100 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,110 గా ట్రెండ్ అవుతుంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి రూ.72,600 గా కొనసాగుతుంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.77,000లు కాగా, బెంగుళూరులో కిలో వెండి రూ.71,500 గా కొనసాగుతుంది.