P Krishna
ఇటీవల పసిడి కొనుగోలు బాగా పెరిగిపోతుంది. ప్రస్తుతం బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.
ఇటీవల పసిడి కొనుగోలు బాగా పెరిగిపోతుంది. ప్రస్తుతం బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.
P Krishna
దేశంలో బంగారం కోనుగోలు ఎక్కువైంది.. దీంతో పసిడికి డిమాండ్ కూడా బాగా పెరిగిపోయింది.. అదే బాటలో వెండి ధరలు కూడా బాగా పెరిగిపోతూ వచ్చాయి. గత ఏడాది చివర్లో పసిడి ధరలు అమాంతం పెరిగిపోతూ వచ్చాయి. ఈ ఏడాది అనూహ్యంగా పసిడి, వెండి ధరలు దిగి వస్తున్నాయి. బంగారం కొనుగోలు చేయలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్ అంటున్నారు నిపుణులు. వచ్చేది పెళ్లిళ్ల సీజన్.. మళ్లీ బంగారం, వెండి ధరలు పెరిగే ఛాన్స్ ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. గత వారం రోజులుగా పసిడి ధరలు స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ రోజు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
బంగారం ఎంత విలువైందతో ప్రత్యేకంగా చెప్పన్కరలేదు. అందుకే బంగారం అంటే మహిళలు, పురుషులు తెగ ఇష్టపడుతుంటారు. ఇటీవల బంగారం ధరలు భారీగా పతనం అవుతున్న క్రమంలో మహిళలు జ్యులరీ షాపులకు క్యూ కడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న పరిణామాల కారణంగా తరుచూ పసిడి, వెండి ధరల్లో మార్పులు సంభవిస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు స్వల్పంగా తగ్గుతున్న సమయంలో పసిడి కొనుగోలు చేస్తే మంచిదని అంటున్నారు. తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ లో నేటి గోల్డ్ రేటు ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.57,490 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.62,720 వద్ద కొనసాగుతుంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 76,400 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాలు ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,640 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,870 వద్ద కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై, కేరళా,బెంగుళూరు,కోల్‌కొతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,490 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 62,720 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.63,220 వద్ద కొనసాగుతుంది. చెన్నై కిలో వెండి ధర రూ. 76,500 లు ఉండగా, ఢిల్లీ, ముంబై లో రూ.74,900 వద్ద కొనసాగుతుంది. బెంగుళూరు లో కిలో వెండి ధర రూ.72,300, కోల్‌కొతాలో కిలో వెండి ధర రూ.74,900 వద్ద ట్రెండ్ అవుతుంది.