P Krishna
Gold and Silver Prices: అంతర్జాతీయ మార్కెట్ లో జరిగే పరిణామాలు పసిడి, వెండిపై పడటంతో ధరల్లో తరుచూ మార్పులు సంభవిస్తున్నాయి.
Gold and Silver Prices: అంతర్జాతీయ మార్కెట్ లో జరిగే పరిణామాలు పసిడి, వెండిపై పడటంతో ధరల్లో తరుచూ మార్పులు సంభవిస్తున్నాయి.
P Krishna
బంగారం అంటే ఇష్టపడని వారు ఉండరు. ఇటీవల దేశంలో పసిడి కొనుగోలు బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా పండుగలు, వివాహాది శుభకార్యాలకు మహిళలు ఎక్కువగా పసిడి కొనుగోలు చేస్తుంటారు. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్ లో వస్తున్న మార్పుల కారణంగా తరుచూ పసిడి ధరలు తగ్గుతూ, పెరుగుతూ వస్తున్నాయి. దీంతో కొనుగోలుదారులు బంగారం కొనుగోలు విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. జనవరి నెలలో బంగారం, వెండి ధరలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి.. కానీ నెల చివర్లో బంగారం, వెండి ధరలు మళ్లీ పుంచుకున్నాయి. నేడు మార్కెట్ లో పసిడి, వెండి ధరల విషయానికి వస్తే..
ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువు ఏదంటే చాలా మంది బంగారం అంటారు. బంగారం అలంకరణ మాత్రమే కాదు, గౌరవం, భద్రత. దేశంలో ఏ చిన్న శుభకార్యమైనా మహిళలు బంగారం కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుంటారు. బంగారం ధరల్లో మార్పులు.. చేర్పులు జరుగుతున్నాయి. ఎప్పుడు పెరుగుతుందో.. ఎప్పుడు తగ్గుతుందో తెలియని పరిస్థితి. అందుకే ధరలు తగ్గినపుడు లేదా స్థిరంగా కొనసాగే సమయంలో కొనుగోలు చేస్తే మంచిదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, వరంగల్, విశాఖ, విజయవాడ లో నేటి పసిడి ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.58,300 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.63,600 వద్ద కొనసాగుతుంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.300 పెరిగి ప్రస్తుతం రూ. 76,800 వద్ద ట్రెండ్ వుతుంది.
ఇక దేశంలోని ప్రధాన నగరాలు బంగారం, వెండి ధరల విషయానికి వస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,450లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.63,750 వద్ద కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై, బెంగుళూరు, కేరళాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 58,300 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63,600 వద్ద కొనసాగుతుంది. కోల్‌కొతా లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 58,300 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63,600 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 58,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరలు రూ.64,250 వద్ద కొనసాగుతుంది. చెన్నై కిలో వెండి ధర రూ.78,000 లు ఉండగా, ఢిల్లీ, ముంబై లో రూ.76,500, కోల్‌కొతాలో కిలో వెండి ధర రూ. 74,800, బెంగుళూరు లో కిలో వెండి ధర రూ.73,500 వద్ద ట్రెండ్ అవుతుంది.