P Krishna
భారతీయులు బంగారం అంటే ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. పండుగలు, పెళ్లిళ్లు.. ఇతర శుభకార్యాలకు ఎక్కువగా బంగారు ఆభరణాలు కొనేందుకు ఇష్టపడుతుంటారు మహిళలు. ఇందుకు తగ్గట్టు పసిడికి డిమాండ్ ఉంటుంది.
భారతీయులు బంగారం అంటే ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. పండుగలు, పెళ్లిళ్లు.. ఇతర శుభకార్యాలకు ఎక్కువగా బంగారు ఆభరణాలు కొనేందుకు ఇష్టపడుతుంటారు మహిళలు. ఇందుకు తగ్గట్టు పసిడికి డిమాండ్ ఉంటుంది.
P Krishna
దేశంలో పసిడి కొనుగోలు బాగా పెరిగిపోయింది. పండుగలు, శుభకార్యాలు, ఇతర వేడుకలకు మహిళలు ఎక్కువగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జ్యులరీ షాపులు కిట కిటలాడుతున్నాయి. దీనికి తోడు కొత్త ఏడాదికి బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పట్టాయి. ఇదే మంచి సమయం అని బంగారం కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాది ఆఖర్లో పసిడి, వెండి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో బంగారం కొనాలా? వద్దా? అన్న సందిగ్ధంలో పడిపోయారు జనాలు. అంతర్జాతీయ మార్కెట్ లో వస్తున్న మార్పుల కారణంగా పసిడి, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు వస్తున్నాయని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. శుక్రవారం మార్కెట్ లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మహిళలకు గొప్ప శుభవార్త.. కొత్త సంవత్సరం బంగారం, వెండి ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో మహిళలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. సాధారణంగా పండుగల సమయంలో డిమాండ్ ని బట్టి ధరలు ఎక్కువగా పెరుగుతుంటాయి. గత ఏడాది గరిష్టానికి పెరిగిన గోల్డ్ రేట్ ఇప్పుడు భారీగా తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, వరంగల్, విశాఖ, విజయవాడ లో నేటి పసిడి ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,600 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 62,830 వద్ద కొనసాగుతుంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 77,500 వద్ద ట్రెండ్ అవుతుంది.
దేశంలోని ప్రధాన నగరాలు ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 57,500 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.63,980 వద్ద కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై, కోల్ కొతా, బెంగుళూరు, కేరళాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 57,600 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 62,830 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 63,380 వద్ద కొనసాగుతుంది. వెండి ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. చెన్నై, కేరళాలో రూ.77,500లు ఉండగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి ధర రూ. 76,000, బెంగుళూరు లో కిలో వెండి ధర రూ. 73,500 వద్ద ట్రెండ్ అవుతుంది.