P Krishna
Gold and Silver Rates: ఇటీవల పసిడి, వెండి ధరలు తరుచూ మారుతూ వస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో పండగల, శుభకార్యాల సీజన్ మొదలైంది. మొన్నటి వరకు చుక్కులు చూపించిన పసిడి అమాంతం పడిపోయింది.
Gold and Silver Rates: ఇటీవల పసిడి, వెండి ధరలు తరుచూ మారుతూ వస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో పండగల, శుభకార్యాల సీజన్ మొదలైంది. మొన్నటి వరకు చుక్కులు చూపించిన పసిడి అమాంతం పడిపోయింది.
P Krishna
ప్రపంచంలో బంగారం అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. దేశంలో బంగార ఆభరణాలు ధరించడం ఫ్యాషన్ మాత్రమే కాదు.. గౌరవం. ఇటీవల బంగారం కేవలం ఆభరణాలుగానే కాకుండా మంచి పెట్టుబడిగా చూస్తున్నారు సామాన్య ప్రజలు. భవిష్యత్ లో పసిడి ధరలు పెరిగిపోతున్నాయి.. దేనికైనా అవసరాలకు పనికి వస్తుందని మధ్యతరగతి కుటుంబీకులు భావిస్తున్నారు. అందుకే ఎక్కువగా బంగారం పై డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. ఇటీవల పసిడి ధరల్లో తరుచూ మార్పులు రావడంతో ఎప్పుడు కొనుగోలు చేయాలో అర్థంకాని పరిస్థితి ఉంది. పసిడి ధరలు తగ్గినపుడు కొనుగోలు చేస్తు చాలా లాభం అంటున్నారు నిపుణుుల. నేడు మార్కెట్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. వివరాల్లోకి వెళితే..
దేశంలో పసిడి ఎంతో విలువైన లోహంగా భావిస్తారు. ప్రపంచంలో ఏ లోహానికి లేని వ్యాల్యూ దీనికి ఉంటుంది. భారత దేశంలో మహిళలు తమ ఒంటిపై ఎంతోకొంత బంగారం ఉండాలని కోరుకుంటారు.ప్రస్తుతం ఆషాఢ మాసం సీజన్ మొదలైంది. పండగలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు పసిడి కొనుగోలు చేస్తుంటారు మహిళలు. మొన్నటి వరకు పసిడి ధరలు చుక్కలు చూపించాయి. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి గొప్ప శుభవార్త. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి పై రూ.10 తగ్గి, రూ.68,140 వద్ద కొనసాగుతుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.10 తగ్గి, రూ.74,340 వద్ద కొనసాగుతుంది. ఇక తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.68,140 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.74,340 వద్ద కొనసాగుతుంది.
దేశంలోని ప్రధాన నగరాలు ఢిల్లీ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,290ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 74,490 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,740 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.74,990 వద్ద కొనసాగుతుంది. ముంబై, కోల్‌కొతా, కేరళా, బెంగుళూరు లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,140 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.74,340 వద్ద కొనసాగుతుంది. దేశంలో కిలో వెండి పై రూ.100 తగ్గింది. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ.97,650, ఢిల్లీ,ముంబై, కోల్ కొతా లో కిలో వెండి ధర రూ.93,150గా,బెంగుళూరులో రూ.91,650 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో కిలో వెండి ధర. 97,650 వద్ద కొనసాగుతుంది.