బంగారం కొనాలి అనుకుంటున్నారా? ఈరోజే బెస్ట్ ఛాన్స్!

Gold and Silver Rates: దేశంలో ప్రస్తుతం పసిడి, వెండి ధరలు తరుచూ పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. దీంతో కొనుగోలుదారులు అయోమయంలో పడిపోతున్నారు. పసిడి ధరలు తగ్గినపుడు వెంటనే కొనుగోలు చేస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Gold and Silver Rates: దేశంలో ప్రస్తుతం పసిడి, వెండి ధరలు తరుచూ పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. దీంతో కొనుగోలుదారులు అయోమయంలో పడిపోతున్నారు. పసిడి ధరలు తగ్గినపుడు వెంటనే కొనుగోలు చేస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ప్రపంచంలో బంగారం అంటే ఇష్టపడని వారు ఉండరు. ముఖ్యంగా భారతీయ మహిళలు పసిడి కి ఇచ్చే విలువ అంతా ఇంతా కాదు. పండుగలు, పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలకు తప్పకుండా పసిడి కొనుగోలు చేస్తుంటారు. ఇటీవల మధ్యతరగతి కుటుంబీకులు బంగారంపై ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు.. కారణం భవిష్యత్ లో పసిడి ధర రెట్టింపునకు చేరుకుంటుంది.. ఆ సమయంలో ఏ అవసరాలకైనా పనికి వస్తుందనే ఉద్దేశంతో కొనుగోలుపై దృష్టిపెడుతున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో జరుగుతున్న మార్పుల ప్రభావం పసిడి, వెండిపై పడటంతో తరుచూ ధరల్లో మార్పులు వస్తున్నాయని అంటున్నారు ఆర్థిక నిపుణులు. నేడు మార్కెట్లో పసిడి, వెండి ధరల ఎలా ఉన్నాయో చూద్దాం.

దేశంలో ఇటీవల పసిడి కొనుగోలు రోజు రోజుకీ పెరిగిపోతుంది. దీంతో డిమాండ్ కూడా అదే రేంజ్ లో పెరిగిపోతుంది. కొన్నిరోజులుగా పసిడి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.. అంతలోనే తగ్గుముఖం పడుతున్నాయి. వారం రోజులుగా తగ్గుముఖం పట్టి నిన్న అమాంతం పెరిగిపోయింది. పండుగలు, శుభకార్యాలకు ఇప్పటి నుంచి పసిడి కొనుగోలు చేయడం మొదలు పెట్టారు. శనివారం (జులై 6) మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.10 తగ్గి, రూ.66,990 వద్ద కొనసాగుతుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.10 తగ్గి, రూ.73,080 వద్ద కొనసాగుతుంది. కేజీ వెండి ధర రూ.100 పెరిగి రూ.93,300 వద్ద ట్రెండ్ అవుతుంది. ఇక తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.10 తగ్గి, రూ.66,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.73,080 వద్ద కొనసాగుతుంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఢిల్లీలో 22 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.67,140 ఉండగా. 24 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ. 73,230 లకు చేరింది. ముంబై, కోల్‌కొతా, కేరళా, బెంగుళూరు‌లో 22 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.66,990 ఉండగా. 24 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.73,080 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.67,590లకు చేరింది. 24 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ.73,740 లకు చేరింది. కిలో వెండి పై రూ.100 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.97,800 వద్ద కొనసాగుతుంది. ఢిల్లీ, కోల్‎కత్తాలో కిలో వెండి రూ.93,200 ఉండగా, బెంగుళూరులో కిలో వెండి ధర రూ. 92,600 వద్ద కొనసాగుతుంది. చెన్నైలొ కిలో వెండి ధర రూ.97,700 వద్ద ట్రెండ్ అవుతుంది.

 

Show comments