iDreamPost
android-app
ios-app

బంగారం కొనాలనుకుంటున్నారా.. త్వరపడండి.. నేటి ధరలు ఇలా ఉన్నాయి!

  • Published Jul 12, 2023 | 7:50 AMUpdated Jul 12, 2023 | 7:50 AM
  • Published Jul 12, 2023 | 7:50 AMUpdated Jul 12, 2023 | 7:50 AM
బంగారం కొనాలనుకుంటున్నారా.. త్వరపడండి.. నేటి ధరలు ఇలా ఉన్నాయి!

బంగారం కొనాలనుకుని.. పెరుగుతున్న ధరలు చూసి ఆగిపోతున్నారా.. అయితే మీకు ఇదే మంచి అవకాశం.. జూలై ఆరంభం నుంచి పసిడి ధరలు స్థిరంగా ఉండటం, లేదంటే తగ్గడం చేస్తున్నాయి. కనుక ఇన్ని రోజులు బంగారం కొనాలని భావించి.. పెరుగుతున్న ధరలు చూసి ఆగిపోయిన వారు ఇప్పుడే తర్వపడితే మంచిది అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. ఇక బంగారం మీద పెట్టుబడి పెట్టాలనుకునేవారికి కూడా ఇదే మంచి అవకాశం కనుక దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెబుతున్నారు. ఈ వారం ప్రాంరభంలో అనగా సోమవారం నాడు స్థిరంగా ఉన్న బంగారం ధర.. మంగళవారం స్వల్పంగా తగ్గగా.. నేడు అనగా బుధవారం కూడా స్థిరంగా ఉంది. మరి నేడు హైదరాబాద్‌, ఢిల్లీ వంటి నగరాల్లో బంగారం ధర ఎలా ఉంది.. వెండి ధర తగ్గిందా, పెరిగిందా.. స్థిరంగా ఉందా వంటి వివరాలు..

నేడు హైదరాబాద్‌లో బంగారం ధర స్థిరంగా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్‌ బంగారం ధర 54,450 రూపాయలుగా ఉంది. క్రితం సెషన్‌లో ఉన్న రేటే నేడు కొనసాగింది. అలానే 24 క్యారెట్‌ మేలిమి బంగారం 10 గ్రాముల ధర నేడు 59,410 రూపాయల వద్ద స్థిరంగా ఉంది. ఇక ఢిల్లీలో 22 క్యారెట్‌ బంగారం 10 గ్రాముల ధర నేడు 54,600 రూపాయలుగా ఉండగా.. 24 క్యారెట్‌ బంగారం ధర 59,560 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇక వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. నేడు వెండి ధర స్థిరంగా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి రేటు 77,100 రూపాయలు ఉండగా.. ఢిల్లీలో 73, 400 రూపాయలుగా ఉంది.

దేశీయ మార్కెట్‌లో బంగారం ధర స్థిరంగా ఉంటే.. ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లో మాత్రం ధర పెరిగింది. అమెరికా డాలర్‌, 10 ఇయర్స్‌ బాండ్‌ ఈల్డ్స్‌ బలహీనపడడంతో నేడు అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు ధర పెరిగింది. ప్రస్తుతం ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర 1,936 డాలర్ల వద్ద ఉంది. ఈ ఏడాది యూఎస్‌ ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు ఉండనుంది అని ప్రకటించారు. ఇది బంగారం ధర మీద ప్రభావం చూపుతుంది అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి